Kingdom: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ ఫ్లిక్ ‘కింగ్డమ్’ ఫ్యాన్స్‌లో భారీ హైప్ క్రియేట్ చేస్తోంది. డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రాన్ని పక్కా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దుతున్నారు. ఈ మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. రిలీజ్ డేట్‌పై రకరకాల రూమర్లు వైరల్ అవుతున్న వేళ, మేకర్స్ గట్టిగా స్పందించారు.
‘కింగ్డమ్’లో ఎలాంటి రీషూట్స్ లేవు, వాయిదా పడే ప్రసక్తే లేదని టీమ్ క్లారిటీ ఇచ్చింది. ప్లాన్ చేసినట్లుగానే ఈ చిత్రం గ్రాండ్‌గా రిలీజ్‌కు రెడీ అవుతోందని చెప్పారు. ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్న ఫేక్ వార్తలను ఖండిస్తూ, ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇచ్చే అప్‌డేట్స్ రాబోతున్నాయని హామీ ఇచ్చారు.
Also Read: Kubera: అనగనగా కథ’ సాంగ్‌తో ‘కుబేర’పై అంచనాలు రెట్టింపు!
Kingdom: ఈ బిగ్ బడ్జెట్ మూవీలో గ్లామరస్ బ్యూటీ భాగ్యశ్రీ బొర్సె హీరోయిన్‌గా కనిపించనుంది. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పాటలతో రచ్చ చేయడానికి సిద్ధమవుతున్నాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య ఈ ప్రాజెక్ట్‌ను లావిష్‌గా నిర్మిస్తున్నారు. మొత్తానికి విజయ్ ఫ్యాన్స్‌కు ఫుల్ జోష్ ఇచ్చే ఈ మూవీ థియేటర్లలో రచ్చ చేయడానికి రెడీ అవుతుంది.