Kingdom Twitter Review

Kingdom Twitter Review: హిట్ కొట్టిన విజయ్.. ‘కింగ్డమ్‌’ ట్విటర్‌ రివ్యూ

Kingdom Twitter Review: టాలీవుడ్ యూత్ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన ‘కింగ్‌డమ్’ సినిమా జూలై 31న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయింది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు, సూర్యదేవర నాగ వంశీ మరియు సాయి సౌజన్య నిర్మాతలుగా వ్యవహరించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చూన్ ఫోర్ సినిమాస్ ఈ చిత్రాన్ని నిర్మించాయి.

ఈ సినిమాలో భాగ్యశ్రీ భోర్సే హీరోయిన్‌గా నటించగా, సత్యదేవ్, వెంకటేష్ ముఖ్యపాత్రల్లో కనిపించారు. సంగీత దర్శకుడిగా రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ తన మేజిక్ మల్లి చూపించాడు.

టీజర్ నుంచే హైప్.. రిలీజ్ తరువాత పాజిటివ్ టాక్‌

రిలోజ్‌కి ముందే టీజర్, ట్రైలర్ లతో పెద్ద ఎత్తున హైప్ క్రియేట్ చేసుకున్న ఈ సినిమాకు, ముఖ్యంగా యూఎస్ ప్రీమియర్ షోల నుండి మంచి స్పందన వచ్చింది. తొలి షోల తరువాత నెటిజన్లు ట్విట్టర్‌లో ఇచ్చిన అభిప్రాయాల ప్రకారం – సినిమా మొదటి నుంచి చివరి వరకు అట్రాక్టివ్‌గా ఉందని చెబుతున్నారు.

విజయ్ దేవరకొండ “సూరి” పాత్రలో పర్‌ఫార్మెన్స్ అదిరిపోయిందంటూ అభిమానులు మెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా అతని మాస్ యాక్షన్, ఎమోషనల్ డైలాగ్స్, భాగ్యశ్రీతో ఉన్న రొమాంటిక్ ట్రాక్ సినిమాకు హైలైట్‌గా నిలిచినట్టు చెబుతున్నారు.

అన్నదమ్ముల అనుబంధం – సినిమా హృదయాన్ని తాకే అంశం

విజయ్ దేవరకొండ – సత్యదేవ్ అన్నదమ్ములుగా నటించిన ఈ సినిమా ప్రధానంగా వారి మధ్య ఉన్న అనుబంధాన్ని ఆసక్తికరంగా చూపించిందంటూ చాలామంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ ఎమోషనల్ ట్రాక్ సినిమాకు పెద్ద బలంగా మారిందని, ప్రేక్షకుల హృదయాలను తాకిందని చెబుతున్నారు.

Also Read: Anasuya: బోల్డ్ గా ఉండటంపై ఘాటుగా స్పందించిన అనసూయ

బీజీఎమ్‌తో బొమ్మ పీక్‌కి తీసుకెళ్లిన అనిరుధ్‌

అనిరుధ్ సంగీతం సినిమాకే ఊపిరిగా నిలిచిందని సోషల్ మీడియాలో పోస్టులు వస్తున్నాయి. శ్రీలంక జైలు సీన్స్‌, బోట్ సీన్‌ లాంటి సీక్వెన్సులు సినిమాను మరో లెవెల్‌కి తీసుకెళ్లాయని చెబుతున్నారు. ప్రతీ సీన్‌లోనూ అనిరుధ్ BGM బాగా ఎలివేట్ చేసిందని ప్రత్యేకంగా గుర్తిస్తున్నారు.

క్లైమాక్స్ ఎఫెక్ట్ – కొన్ని మిశ్రమ స్పందనలు

ఒకవైపు కింగ్‌డమ్ సినిమాకు పాజిటివ్ టాక్ దక్కుతుండగా, మరోవైపు కొన్ని మైనస్ పాయింట్లపై కామెంట్లు కూడా కనిపిస్తున్నాయి. కొన్ని పోస్టుల ప్రకారం, క్లైమాక్స్‌ కొద్దిగా డైలూట్ అయినట్టు అనిపించిందని, ఎమోషనల్ సీన్స్ అంతగా ప్రభావం చూపలేదని కొందరు అభిప్రాయపడుతున్నారు.

అలాగే, పుష్పా, కేజీఎఫ్‌, బాహుబలి వంటి సినిమాల్లో చూసిన కొన్ని సీన్లు గుర్తు వచ్చేలా ఉన్నాయి అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఫస్టాఫ్ స్ట్రాంగ్‌గా ఉన్నా, సెకండాఫ్ కొద్దిగా స్లో అయ్యిందని వారు పేర్కొంటున్నారు.

చివరగా…

కింగ్‌డమ్ సినిమా పైన ఫస్ట్ డే నుంచే పాజిటివ్ టాక్‌ రావడం విజయ్ దేవరకొండ అభిమానులకి మంచి వార్తే. విజయ్ దేవరకొండ తన నటనతో మరోసారి తన స్థాయిని నిరూపించుకున్నాడు. గౌతమ్ తిన్ననూరి కథనం, అనిరుధ్ బీజీఎమ్, అన్నదమ్ముల అనుబంధం కలిసి ఈ సినిమాను ఒక ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా నిలబెట్టాయి. కొన్ని చిన్నతొలతులు ఉన్నా, ఈ సినిమా థియేటర్‌లో చూసే అనుభూతి తప్పకుండా ఉంటుందని చెప్పొచ్చు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *