Kingdom

Kingdom: వాయిదా పడ్డ ‘కింగ్డమ్’!

Kingdom: విజయ్ దేవరకొండ హీరోగా, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా, దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “కింగ్డమ్” గురించి అందరికీ తెలిసిందే. ఈ సినిమా ప్రతి అప్డేట్‌తో హైప్‌ను రెట్టింపు చేస్తోంది. మొదట మే 30న రిలీజ్ ప్లాన్ చేసిన మేకర్స్, దేశంలోని ప్రస్తుత పరిస్థితుల కారణంగా రిలీజ్‌ను వాయిదా వేశారు. తాజాగా అఫీషియల్ అనౌన్స్‌మెంట్‌తో రూమర్స్‌కు క్లారిటీ వచ్చింది. “కింగ్డమ్” ఈ జూలై 4న తెలుగు, హిందీ, తమిళ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. మే 30నే విడుదల చేయాలని స్టిక్‌గా ఉన్నామని, కానీ పరిస్థితుల ప్రభావంతో డేట్ మార్చాల్సి వచ్చిందని మేకర్స్ తెలిపారు. అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ నిర్మించాయి. విజయ్ యాక్షన్ అవతార్, గౌతమ్ స్టైలిష్ డైరెక్షన్‌తో “కింగ్డమ్” బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమాపై ఫ్యాన్స్ లో ఎక్స్‌పెక్టేషన్స్ ఆకాశాన్ని తాకుతున్నాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Veera Dheera Sooran: వీర ధీర శూర ఆకట్టుకున్నాడా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *