Kiccha Sudeep

Kiccha Sudeep: ‘మాక్స్’ మూవీ రిలీజ్ డేట్ లాక్.. విడుదల ఎప్పుడంటే?

Kiccha Sudeep: కిచ్చా సుదీప్ నటించిన తాజా చిత్రం ‘మ్యాక్స్’. విజయ్ కార్తికేయ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రముఖ తమిళ నిర్మాత కలైపులి ఎస్. ధాను నిర్మించారు. వరలక్ష్మీ శరత్ కుమార్, సునీల్ ఇందులో కీలక పాత్రలు పోషించారు. ఇందులో అర్జున్ మహాక్షయ్ అనే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రను చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ నెల 27న విడుదల కాబోతున్న ఈ సినిమాను తెలుగు రాష్ట్రాలలో ఏషియన్ సురేశ్‌ ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ విడుదల చేస్తోంది. ‘మ్యాక్స్’కు అజనీశ్‌ లోకనాథ్‌ సంగీతాన్ని అందిస్తున్నారు.

ఈ న్యూస్ కూడా చదవండి: వేసవి కానుకగా ‘కరాటే కిడ్: లెజెండ్స్’

Karate Kid: Legends: బ్రూస్ లీ తర్వాత ప్రపంచవ్యాప్తంగా తన యాక్షన్ మూవీస్ తో ఆకట్టుకున్నాడు జాకీ చాన్. ఆయన నటించిన ‘కరాటే కిడ్’ మూవీ 2010లో వచ్చి ఘన విజయం సాధించింది. అందులో హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ కొడుకు జాడే స్మిత్ కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు అదే ఫ్రాంచైజ్ లో ‘కరాటే కిడ్: లెజెండ్స్’ పేరుతో మరో సినిమా వస్తోంది. రాల్ఫ్ మాచియో ఇందులో జాకీ చాన్ తో కలిసి నటించాడు. జోనాధన్ ఎంట్విస్ట్లే దర్శకత్వం వహించిన ఈ మూవీలో బెన్ వాంగ్, జాషువా జాక్సన్, సాడీ స్టాన్లీ, మింగ్ నా వెన్ కీలక పాత్రలు పోషించారు. సోనీ పిక్చర్స్ సంస్థ ఇండియాలో ‘కరాటే కిడ్ : లెజెండ్స్’ను వచ్చే యేడాది మే 30న తెలుగు, తమిళ, హిందీ, ఆంగ్ల భాషల్లో విడుదల చేయబోతోంది. ఈ సందర్భంగా మూవీ ఫస్ట్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

Karate Kid: Legends' Trailer: Kid In The City, With Familiar Friends

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *