Khumbamela::ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా కార్యక్రమంలో త్రివేణి సంగమంలో ఇప్పటివరకు 60 కోట్ల మందికి పైగా భక్తులు పుణ్య స్నానం చేసారని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. మహాకుంభమేళ శక్తిని ప్రపంచం మొత్తం కీర్తిస్తున్నదని, కొన్ని ఇష్టంలేని వ్యక్తులు దీన్ని అపఖ్యాతి పాలజేయాలని ప్రయత్నిస్తున్నారని ఆయన చెప్పారు.
మహాశివరాత్రి వరకు 60 కోట్ల మంది పవిత్ర స్నానాలు ఆచరించబడతాయని ముందుగా అంచనా వేసినప్పటికీ, ఆ అంచనాలను మించి భక్తులు ముందే హాజరైనట్లు ఆయన తెలిపారు.
గత నెల 13న ప్రారంభమైన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం మరికొన్ని రోజులు మాత్రమే కొనసాగుతుందని, అందువల్ల భారీ సంఖ్యలో భక్తులు తరలివెళుతున్నారని యూపీ అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా, చివరి రోజు అయిన మహాశివరాత్రి (26న) నాడు ఇంకా ఎక్కువ సంఖ్యలో భక్తుల రాబోవు అవకాశాన్ని గుర్తించారు.