Khaleda Zia:

Khaleda Zia: బంగ్లాదేశ్ మాజీ ప్ర‌ధాని బేగం ఖ‌లీదా జియా క‌న్నుమూత‌

Khaleda Zia:బంగ్లాదేశ్ దేశానికి మూడుసార్లు ప్ర‌ధానమంత్రిగా ప‌నిచేసిన బేగం ఖ‌లీదా జియా (80) ఈ రోజు (డిసెంబ‌ర్ 30)న క‌న్నుమూశారు. ఇప్ప‌టికే అల్ల‌ర్ల‌తో అట్టుడుకుతున్న ఆ దేశంలో జియా మ‌ర‌ణం తీవ్ర విషాదంలో నింపింది. ఆమె మ‌ర‌ణం ప‌ట్ల భార‌త‌దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ స‌హా వివిధ దేశాధినేత‌లు, కీల‌క నేత‌లు సంతాపం తెలిపారు.

Khaleda Zia:బంగ్లాదేశ్ నేష‌న‌లిస్టు పార్టీ (బీఎన్‌పీ) చైర్‌ప‌ర్స‌న్ అయిన ఖ‌లీదా జియా గ‌త కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు. ఆమెకు లివ‌ర్ సిర్రోసిస్‌, డ‌యాబెటీస్‌, గుండె, ఆర్థ‌రైటిస్‌ జ‌బ్బుల‌తో చికిత్స పొందుతున్నారు. గ‌త న‌వంబ‌ర్ నెల‌లో ఆమె చికిత్స కోసం ఆసుప‌త్రిలో చేరారు. ఈ రోజు ఉద‌యం 6 గంట‌ల‌కు ఢాకాలోని ఎవ‌ర్‌కేర్ ఆసుప‌త్రిలో తుది శ్వాస విడిచారు.

Khaleda Zia:బేగం ఖ‌లీదా జియా 1991-96 మ‌ధ్య‌, 2001,2006 మ‌ధ్య బంగ్లాదేశ్‌కు మూడుసార్లు ప్ర‌ధానిగా వ్య‌వ‌హ‌రించారు. ఆ దేశ తొలి మ‌హిళా ప్ర‌ధానిగా కూడా ఆమె గుర్తింపు పొందారు. ఆమె భ‌ర్త జియావుల్ రెహ‌మాన్ మ‌ర‌ణానంత‌రం బీఎన్‌పీ నాయ‌క‌త్వ‌ బాధ్య‌త‌ల‌ను స్వీక‌రించారు. ఆదేశంలో ప్ర‌జాస్వామ్య పున‌రుద్ధ‌ర‌ణ‌లో ఖ‌లీదా జియా కీల‌క పాత్ర పోషించారు.

Khaleda Zia:ఇదిలా ఉండ‌గా, ఆమె కుమారుడు, బీఎన్‌పీ యాక్టింగ్‌ చీఫ్ తారిక్ రెహ‌మాన్ 17 ఏళ్ల అనంత‌రం లండ‌న్ నుంచి ఇటీవ‌లే తిరిగి స్వ‌దేశానికి వ‌చ్చారు. అదే విధంగా వ‌చ్చే 2026 సంవ‌త్స‌రం ఫిబ్ర‌వ‌రి నెల‌లో ఆ దేశంలో సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌రుగ‌నున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *