Khairatabad Ganesh:

Khairatabad Ganesh: ఖైర‌తాబాద్ గ‌ణేషుడి దర్శ‌నానికి వ‌చ్చిన నిండు గ‌ర్భిణి ప్ర‌స‌వం

Khairatabad Ganesh: హైద‌రాబాద్‌లోని ఖైర‌తాబాద్ ప్రాంతంలో ఏర్పాటు చేసే వినాయ‌కుడికి ప్ర‌త్యేకత ఉన్న‌ది. ఏటేటా భారీ ఆకారంలో గ‌ణేషుడిని ఏర్పాటు చేసి, న‌వ‌రాత్రులు పూజ‌లు చేసి, ఆ త‌ర్వాత భారీ శోభాయాత్ర న‌డుమ నిమజ్జ‌నం చేస్తారు. ఈ సారి 69 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో భారీ వినాయ‌కుడు క‌నువిందు చేస్తున్నాడు. ఈ వినాయ‌కుడి తొలిపూజ ఆగ‌స్టు 27న జ‌రిగింది. ఈ భారీ గ‌ణేషుడిని చూసేందుకు వ‌చ్చిన ఓ నిండు గ‌ర్భిణి పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది.

Khairatabad Ganesh: ఖైర‌తాబాద్‌లోని భారీ వినాయకుడి వ‌ద్ద రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ జిష్ణుదేవ్ వ‌ర్మ దంప‌తులు తొలి పూజ‌లో పాల్గొన్నారు. భారీ గ‌ణేషుడికి కుడివైపున శ్రీ వాస‌వీ క‌న్య‌కా ప‌ర‌మేశ్వ‌రి అమ్మ‌వారు, ఎడ‌మ‌వైపున ఖైర‌తాబాద్ గ్రామ దేవ‌త గ‌జ్జెల‌మ్మ అమ్మ‌వారి విగ్ర‌హాల‌ను ఉంచారు. ఈ విగ్ర‌హం వ‌ద్ద 60 సీసీ కెమెరాల‌ను ఏర్పాటు చేయ‌గా, 600 మంది పోలీసులు భారీ బందోబ‌స్తు ఏర్పాటు చేస్తున్నారు.

Khairatabad Ganesh: ఖైర‌తాబాద్ గ‌ణేషుడి ద‌ర్శ‌నానిక వ‌చ్చిన ఓ మ‌హిళ క్యూలైన్‌లోనే ప్ర‌స‌వించింది. గ‌మ‌నించిన తోటి మ‌హిళ‌లు ఆమెను ప‌క్క‌నే ఉన్న క‌మ్యూనిటీ హెల్త్ సెంట‌ర్‌కు త‌ర‌లించ‌గా, అక్క‌డి వైద్యులు వైద్య చికిత్స‌లు అందించారు. ఆ మ‌హిళ రాజ‌స్థాన్ రాష్ట్రానికి చెందిన రేష్మ‌గా గుర్తించారు. త‌ల్లీబిడ్డ క్షేమంగానే ఉన్న‌ట్టు వైద్యులు తెలిపారు. ఆ బిడ్డ‌ను వినాయ‌కుడు ఇచ్చిన ప్ర‌సాదంగా భావించి స్వీక‌రిస్తాన‌ని రేష్మ సంతోషం వ్య‌క్తంచేసింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Delhi: ఉచితాలపై సుప్రీం కోర్టు సంచలన కామెంట్స్..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *