PM Modi: భారత్-అమెరికా వాణిజ్య సంబంధాల్లో కీలక మలుపు వచ్చిన నేపథ్యంలో, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Modi), ప్రపంచ బిలియనీర్, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్(Elon Musk) మధ్య ఫోన్ సంభాషణ జరిగింది. ఈ సంభాషణను స్వయంగా మోదీ తన ‘ఎక్స్’ ద్వారా వెల్లడించారు.
ఈ సంభాషణలో టెక్నాలజీ, ఆవిష్కరణలు, ద్వైపాక్షిక సహకార అంశాలపై చర్చలు జరిగాయని మోదీ పేర్కొన్నారు. ‘‘ఈ ఏడాది ప్రారంభంలో వాషింగ్టన్‌లో జరిగిన మా భేటీలో ప్రస్తావించిన అంశాలను మళ్లీ చర్చించాము. టెక్నాలజీ రంగంలో భారత్-అమెరికాల మధ్య భాగస్వామ్యం మరింత బలోపేతం కావాలి అనే అభిప్రాయంతో ఉన్నాం,’’ అని ఆయన పేర్కొన్నారు.
PM Modi: టెస్లా భారత్‌లో తయారీ యూనిట్ స్థాపనకు ముందడుగు వేస్తోంది. ఇప్పటికే భారత మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు మస్క్ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. సంబంధిత నియామక ప్రక్రియలు ప్రారంభమయ్యాయి. పలు రాష్ట్రాల్లో టెస్లా షోరూం కోసం స్థల పరిశీలన జరుగుతోందని సమాచారం.
ఇక అంతరిక్ష రంగంలో మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ ద్వారా నడుపబడుతున్న స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను భారత్‌లో ప్రారంభించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్‌తో స్టార్‌లింక్ ఒప్పందాలు కుదుర్చుకున్నప్పటికీ, దేశంలో సేవల కోసం కేంద్ర ప్రభుత్వ అనుమతులు ఇంకా లభించలేదు.
Also Read: White House: కరోనా మూలాలను దాచింది బైడెన్.. ల్యాబ్ లీక్ పేరుతో నిజాలు చెప్పిన వైట్ హౌస్
PM Modi: తాజాగా కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, స్టార్‌లింక్ ప్రతినిధులతో సమావేశమై, సంస్థ భారత మార్కెట్లో పెట్టుబడుల ప్రణాళికపై చర్చించారు. ఇది కూడా మోదీ-మస్క్ ఫోన్ సంభాషణకు నేపథ్యం కావచ్చని పరిశీలకులు భావిస్తున్నారు.
భారత-అమెరికా వాణిజ్య ఒప్పందం దిశగా పురోగతి?
ఈ పరిణామాలన్నీ భారత్-అమెరికా మధ్య టారిఫ్ (customs duty) సమస్యలపై చర్చలు జరుగుతున్న సమయంలో చోటుచేసుకోవడం ప్రాధాన్యత కలిగిన విషయం. మస్క్ టెస్లా మాదిరిగానే స్టార్‌లింక్ ప్రాజెక్టులు భారత్‌లో ప్రారంభిస్తే, అమెరికా పెట్టుబడులకు కొత్త దారులు తెరవవచ్చు. అదే సమయంలో భారత్‌కు టెక్నాలజీ, పరిశ్రమల రంగాల్లో భాగస్వామ్యాలు లభించే అవకాశం ఉంది.