హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. శని, ఆదివారాలు, సూర్యాస్తమయం తర్వాత కూల్చివేతలు ఎందుకని ప్రశ్నించింది. శని, ఆదివారాలు కూల్చివేయొద్దని గతంలో కోర్టు తీర్పులున్నాయని తెలిపింది. పొలిటికల్ బాస్‌లను, ఉన్నతాధికారులను మెప్పించేందుకు చట్టవిరుద్ధంగా పని చేయవద్దని వ్యాఖ్యానించింది. కాగా అమీన్‌పూర్ తహశీల్దార్ కోర్టుకు వివరణ ఇవ్వగా, హైడ్రా కమిషనర్ రంగనాథ్ వర్చువల్‌గా హాజరయ్యారు.

ప్రభుత్వ ఆస్తుల రక్షణ పేరుతో అమాయకులను ఇబ్బందులకు గురిచేస్తారా? అని హైకోర్టు ‘హైడ్రా’పై ఆగ్రహం వ్యక్తం చేసింది. అమీన్‌పూర్ తహశీల్దార్ కోరడంతో యంత్రాలు, సిబ్బంది సమకూర్చామని రంగనాథ్ కోర్టుకు తెలిపారు. చార్మినార్ కూల్చివేతకు తహశీల్దార్ యంత్రాలు, సిబ్బంది అడిగితే ఇస్తారా? అని ప్రశ్నించింది. హైడ్రా ఇదే విధంగా ముందుకు వెళ్తే స్టే ఇవ్వాల్సి వస్తుందని కోర్టు హెచ్చరించింది.

హైడ్రా ఏర్పాటు అభినందనీయమేనని.. పనితీరే అభ్యంతరకరంగా ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. అమీన్‌పూర్ ఎమ్మార్వో, హైడ్రా కమిషనర్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. సెలవుల్లో నోటీసులు ఇచ్చి అత్యవసరంగా ఎందుకు కూలుస్తున్నారని ప్రశ్నించింది. హైడ్రాకు కూల్చివేతలు తప్ప మరో పాలసీ లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము అడిగిన ప్రశ్నకే సమాధానం ఇవ్వాలని, దాట వేయొద్దని కమిషనర్ రంగనాథ్‌కు కోర్టు చురకలు అంటించింది.

ప్రముఖ రాజకీయ నాయకులు, ఉన్నతాధికారుల మెప్పించేందుకు కూల్చివేస్తున్నారా? అయినా చట్ట విరుద్ధంగా పని చేయరాదని హైడ్రాకు కోర్టు నోటీసులు జారీ చేసింది. హైడ్రాకు చట్టబద్ధత, అధికారం ఏంటో చెప్పాలని, చట్టాన్ని ఉల్లంఘించి కూల్చివేతలు కూల్చేస్తున్నారని పేర్కొంది. సెలవు దినాల్లో కూల్చివేతలు చేయకూడదని తెలియదా? అని ప్రశ్నించింది.

ప్రజలు ఇళ్లు ఖాళీ చేయకుంటే కూల్చేస్తారా? కోర్డు వద్దని చెబుతున్నా ఎందుకు కూల్చుతున్నారని ప్రశ్నించింది. ప్రభుత్వ ఉద్యోగులు ఆదివారం, సెలవు దినాల్లో ఇంట్లో ఉండకుండా ఎందుకు పనిచేస్తున్నారని అడిగింది. ఇళ్లను కూల్చే ముందు చివరి అవకాశం ఇస్తున్నారా? కనీసం చనిపోయే ముందు ఓ వ్యక్తికి చివరి కోరిక ఏంటి అని అడుగుతారు? అని మండిపడింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Nandyal: నంద్యాల‌లో దారుణం.. ప్రేమించ‌డం లేద‌ని యువ‌తిపై దుండ‌గుడి ఉన్మాదం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *