Kethireddy: చెరువు కబ్జా విషయం పై స్పందించారు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి.నీటి పారుదల శాఖ పంపిన నోటీసుల వెనక రాజకీయ కోణం ఉందని ఆరోపించారు. ఈ భూములకు సంబంధించిన అంశంపై హైకోర్టులో కేసు విచారణ జరుగుతోందని గుర్తుచేశారు. ఓవైపు కోర్టులో విచారణ జరుగుతుంటే అధికారులు నోటీసులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన నాటి నుంచి అధికారులు ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు.
రాజకీయ ఒత్తిళ్ల కారణంగా అధికారులు ఇలా చేస్తున్నారని చెప్పారు. తన కుటుంబ సభ్యుల భూములకు సంబంధించి అన్ని అంశాల్లోనూ క్లియర్ గా ఉన్నట్లు తెలిపారు. దీనిపై కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు కేతిరెడ్డి పేర్కొన్నారు.
అసలేం జరిగిందంటే..
కేతిరెడ్డి కుటుంబం మొత్తం మొత్తం 20.61 ఎకరాల చెరువు భూముల కబ్జాకు పాల్పడ్డారంటూ రెవెన్యూ శాఖ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. చెరువుకు సంబంధించి సర్వే నెంబర్ 908లో 9.30 ఎకరాలు, 909 సర్వే నెంబర్లో 7.90 ఎకరాలు, 910లో 2.50, సర్వే నెంబర్ 661-1లో 0.91 సెంట్లను ఆక్రమించారని గాలి వసుమతి, తదితరులకు అధికారులు నోటీసులు జారీ చేశారు.

