Kethireddy: అధికారం కోల్పోయాక వైసీపీ నేతలకు గట్టి షాకులు తగులుతున్నాయి.ఉమ్మడి అనంతపురం జిల్లాలో గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై సీఎం చంద్రబాబు ప్రభుత్వం ఒక్కొక్కటిగా బహిర్గతం చేస్తోంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి కి భూ ఆక్రమణలకు సంబంధించి రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు షాక్ ఇచ్చారు.ఈనెల 6న కేతిరెడ్డి పీఏ నోటీసులు అందుకున్నారు.ఆక్రమించిన చెరువు భూములను 7రోజుల్లో ఖాళీ చేయాలని, లేదంటే భూములను తామే స్వాధీనం చేసుకుంటామని నోటీసులో పేర్కొన్నారు.
కేతిరెడ్డి కుటుంబం మొత్తం మొత్తం 20.61 ఎకరాల చెరువు భూముల కబ్జాకు పాల్పడ్డారంటూ రెవెన్యూ శాఖ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. చెరువుకు సంబంధించి సర్వే నెంబర్ 908లో 9.30 ఎకరాలు, 909 సర్వే నెంబర్లో 7.90 ఎకరాలు, 910లో 2.50, సర్వే నెంబర్ 661-1లో 0.91 సెంట్లను ఆక్రమించారని గాలి వసుమతి, తదితరులకు అధికారులు నోటీసులు జారీ చేశారు.చెరువు ఆయకట్టు రైతులకు నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీ నెరవేరనుందని స్థానికులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: Supreme Court: వ్యవసాయ చెత్తను తగలబెట్టే రైతులపై జరిమానా కొరడా
ప్రస్తుతం కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి హిమాలయాల పర్యటనలో ఉన్నారు.రెవెన్యూ అధికారుల నోటీసులపై హైకోర్టును ఆశ్రయించామని తెలిపారు. ప్రభుత్వం మారినప్పటి నుంచి ఇబ్బంది పెడుతున్నారని, తన పరువుకు భంగం కల్గించిన వారిపై లీగల్ గా చర్యలు తీసుకుంటామన్నారు.