Pedda Reddy: అనంతపురం జిల్లా తాడిపత్రి మళ్లీ రాజకీయ వేడిగడ్డగా మారింది. వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి, పోలీసుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. తాడిపత్రికి వెళ్తున్న పెద్దారెడ్డిని నారాయణరెడ్డిపల్లి వద్ద పోలీసులు అడ్డుకోవడంతో ఈ సంఘటన చోటు చేసుకుంది.
హైకోర్టు ఆర్డర్స్ ఉన్నా అడ్డుకట్ట
పెద్దారెడ్డి మాట్లాడుతూ, “తాడిపత్రిలోకి వెళ్లేందుకు హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. అయినప్పటికీ పోలీసులు నన్ను అడ్డుకోవడం అర్థరహితం. ఇక్కడ జరుగుతున్నదంతా జెసి ప్రభాకర్ రెడ్డి చెప్పినట్లుగానే జరుగుతోంది” అని మండిపడ్డారు. డీఎస్పీతో నేరుగా వాగ్వాదానికి దిగుతూ, పోలీస్ వ్యవస్థ ఏపీలో పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందని ఆరోపించారు.
ఇది కూడా చదవండి: Chhattisgarh: మందుపాతర పేలి ఒకరు మృతి.. ముగ్గురికి గాయాలు..
పోలీసులు వివరణ
అయితే, పోలీసులు మాత్రం శాంతి భద్రతల కారణంగానే పెద్దారెడ్డిని అడ్డుకున్నామని చెబుతున్నారు. తాడిపత్రిలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారే అవకాశం ఉందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు.
జెసి ప్రభాకర్ రెడ్డి ప్రవేశం
ఇక మరోవైపు, తాడిపత్రిలో శివుడి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి టిడిపి నేత జెసి ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. ఆయన రాకతో ప్రాంతంలో రాజకీయ ఉత్కంఠ మరింత పెరిగింది.