Kerala: చెరువులో చెత్త వేసినందుకు జరీమానా వేయడం అదీ ఒక సెలబ్రిటీకి మనం ఊహించలేం కదూ. కానీ అలా జరిగింది. ప్రముఖ నేపథ్య గాయకుడు ఎం.జి. శ్రీకుమార్ కు రూ. 25,000 జరిమానా విధించారు. కొచ్చి సమీపంలోని ఒక చెరువులో చెత్త వేసినందుకు స్థానిక ప్రభుత్వ సంస్థ ఈ జరిమానా విధించింది.
సినీ నేపథ్య గాయకుడు ఎం.జి. శ్రీకుమార్ స్వస్థలం కేరళలోని తిరువనంతపురం. ఆయన కాదల్ దేశం, మిస్టర్ రోమియో, జీన్స్ వంటి తమిళ చిత్రాలతో పాటు ఇతర భాషలలో 2,500 కి పైగా పాటలు పాడారు. అతను సొంత ఇల్లు కొచ్చి సమీపంలోని ములావుకడు అనే ప్రాంతంలో ఉంది. ఈ ఇల్లు చెరువుకు దగ్గరలో నిర్మించారు. ఇటీవల ఆ ప్రాంతంలో పడవ ప్రయాణం చేసిన ఒక పర్యాటకుడు శ్రీకుమార్ ఇంటిని వీడియో తీశాడు.
Also Read: Hanumakond Court: హనుమకొండ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు
Kerala: ఆ సమయంలో, ఆ ఇంటి లోపల నుంచి వచ్చిన వ్యక్తి తన వద్ద ఉన్న చెత్తతో నిండిన సంచిని సరస్సులోకి విసిరేసి వెళ్లిపోయాడు. దీన్ని ఆ పర్యాటకుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇది చాలా వేగంగా వైరల్ అయింది. ఈ విషయాన్ని చాలా మంది తీవ్రంగా ఖండించారు. సోషల్ మీడియాలో సింగర్ శ్రీకుమార్ పై విమర్శలు వెల్లువెత్తాయి. అధికారులపైనా నెటిజన్లు విరుచుకు పడ్డారు. దీంతో స్పందించిన ములువుకాడు గ్రామ పంచాయతీ శ్రీకుమార్ పై 25,000 రూపాయలు జరిమానా విధించింది. ఆ తర్వాత శ్రీకుమార్ గ్రామ పంచాయతీ అధికారులకు ఆ జరిమానా చెల్లించాడు.