Kerala: సీపీఎం అగ్రనేత, కేరళ మాజీ ముఖ్యమంత్రి విఎస్ అచ్యుతానందన్ (101) కన్నుమూశారు. గుండెపోటుతో గత నెల 23న ఆస్పత్రిలో చేరిన ఆయన, చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వయోభారంతో పాటు అనారోగ్య సమస్యలతో ఆయన ఆరోగ్యం గత కొంతకాలంగా నిలకడగా లేదు.
అచ్యుతానందన్ రాజకీయ జీవితంలో ఎంతో విశిష్టస్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఆయన మూడుసార్లు కేరళ అసెంబ్లీలో విపక్ష నాయకుడిగా సేవలందించారు. 2006-2011 మధ్యకాలంలో కేరళ ముఖ్యమంత్రిగా పని చేశారు. ప్రజల సమస్యల పట్ల గంభీరంగా స్పందించే నాయకుడిగా ఆయనకు మంచి పేరు ఉంది.
అచ్యుతానందన్ సీపీఎం వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరిగా కీలకపాత్ర పోషించారు. పార్టీ సిద్ధాంతాలకు నిబద్ధతగా ఉండి, క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచారు. ఆయన మరణం కేరళ రాజకీయాల్లో పూరించలేని లోటుగా భావిస్తున్నారు.