Kerala: శబరిమలలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కొండ దిగుతున్న సమయంలో అదుపుతప్పిన ట్రాక్టర్ భక్తులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 9 మంది భక్తులు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, అధికార యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడిన భక్తులను సమీప ఆసుపత్రికి తరలించగా, కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.
