Keral High Court: కేరళలోని అయ్యప్ప స్వామి కొలువై ఉన్న శబరిమలలో కొన్ని మార్పులు, చేర్పులపై ఆ రాష్ట్ర హైకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. అక్కడ మండల, మాళవిళక్కు సీజన్లలో పనిచేసే అన్ని హోటళ్లు, రెస్టారెంట్లు, టీస్టాళ్లు, ఇలాంటి తరహాలో ఉన్న ఇతర సంస్థల్లో వారం వారం తనిఖీలు నిర్వహించాలని ట్రావెన్‌కోర్ దేవస్థాన బోర్డు (టీడీబీ) విజిలెన్స్ విభాగాన్ని హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది.
Keral High Court: శబరిమల, ఎరుమేలి యాత్రికులకు, భక్తులకు అందించే ఆహార పదార్థాలు, పానీయాలు పరిశుభ్రంగా, స్వచ్ఛమైన ఆహార పదార్థాలు, సురక్షితమైన నీటితో తయారు చేయాలని కోరుతూ ఇటీవల అఖిల భారతీయ అయ్యప్ప సేవా సంఘం దాఖలు చేసిన పిటిషన్‌ను కేరళ హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ మేరకు ఆ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం ఈ ఉత్తర్వులను జారీ చేసింది.
Keral High Court: ఎరుమేలిలోని కొన్ని హోటళ్లలో అపరిశుభ్రమైన, అనారోగ్యానికి దారితీసే పరిస్థితుల్లో భోజనం, ఇతర వంటలను తయారు చేస్తున్నాయని, పండుగ సీజన్‌లో సంబంధిత అధికారులు అలాంటి వాటిని పట్టించుకోవడమే లేదన్న ఫిర్యాదులపై జస్టిస్ రాజా విజయ రాఘవన్, కేవీ జయకుమార్‌తో కూడిన ధర్మాసనం తీవ్రస్థాయిలో ఆందోళనను వ్యక్తంచేసింది. లక్షలాది మంది భక్తులకు ఫుడ్ సేఫ్టీని నిర్ధారించడంలో ఇటువలంటి లోపాలు కనిపించడం పట్ల వారు దిగ్భ్రాంతిని వ్యక్తంచేశారు.
Keral High Court: సంబంధిత అన్ని ఏజెన్సీలు, విభాగాలతో సమావేశాలు ఏర్పాటు చేసి, ప్రతి సీజన్‌లో శబరిమలలో సురక్షితమైన తాగునీరు, పరిశుభ్రమైన ఆహారం లభ్యతను రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారించాలని కోర్టు ఆదేశించింది. శబరిమల విజిలెన్స్ ప్రత్యేక కమిషనర్ నివేదికలను సమీక్షించి, అవసరమైతే కోర్టుకు కూడా తెలపాలని సూచించింది.