Delhi: ఢిల్లీలో జరిగిన తాజా ఎన్నికల ఫలితాలపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేతలు స్పందించారు. బీజేపీ విజయం సాధించినందుకు అభినందనలు తెలియజేస్తూనే, తమ పార్టీ ప్రజల కోసం పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.
అతిశీ స్పందన:
ఆప్ సీనియర్ నేత అతిశీ మాట్లాడుతూ, “ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నాం. బీజేపీ విజయం సాధించినందుకు వారికి అభినందనలు తెలియజేస్తున్నా. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని బీజేపీని కోరుతున్నా. మేము బీజేపీ గూండాగిరిని ఎదుర్కొంటూ పోరాడాం, భవిష్యత్తులోనూ ప్రజా సమస్యలపై మా పోరాటం కొనసాగుతుంది” అని పేర్కొన్నారు.
కేజ్రీవాల్ ప్రకటన:
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ప్రజా తీర్పును స్వాగతించారు. “నేను రాజకీయాల్లోకి అధికారం కోసం రాలేదు, ప్రజా సేవ కోసం వచ్చాను. ప్రజలు ఇచ్చిన తీర్పును మనస్పూర్తిగా అంగీకరిస్తున్నా. బీజేపీకి అభినందనలు” అని ఆయన అన్నారు.
ఢిల్లీలోని ప్రజా సమస్యలపై తమ పోరాటం కొనసాగిస్తామని ఆప్ నేతలు స్పష్టం చేశారు. మరోవైపు, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను ఎంతవరకు నెరవేరుస్తుందో చూడాలి.

