Keerthy Suresh

Keerthy Suresh: దర్శకురాలిగానూ మెప్పించనున్న కీర్తి సురేష్?

Keerthy Suresh: పెళ్లైనా కెరీర్‌ను వదలని నటి కీర్తి సురేష్ కొత్త అడుగు వేస్తోంది. ఇప్పటివరకు నటనలోనే కాదు, ఇకపై సినిమా నిర్మాణం, దర్శకత్వం వైపూ ఆమె దృష్టి పెట్టనుంది. తాను సొంతంగా స్క్రిప్ట్ రాస్తున్నట్టు ఆమె వెల్లడించడం సంచలనంగా మారింది. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం.

Also Read: Netflix: సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ షాక్..?

పెళ్లి తరువాత వరుస సినిమాలు చేస్తూ గ్లామర్ డోస్ పెంచేసింది కీర్తీ. ప్రస్తుతం ‘రివాల్వర్ రీటా’తో బిజీగా ఉన్న కీర్తి సురేష్ ఇప్పుడు కొత్త ప్రయాణం ప్రారంభించబోతోంది. తాజా ఇంటర్వ్యూలో “నేను సొంతంగా ఒక స్క్రిప్ట్ రాస్తున్నాను” అని ఆమె సంచలన ప్రకటన చేసింది. అంటే నటనతోపాటు దర్శకత్వంలోనూ అడుగుపెట్టనుందన్నమాట. కంగనా రనౌత్, అజయ్ దేవగణ్ లాగా నటిస్తూనే దర్శకత్వం చేపట్టే లేడీ ఆల్‌రౌండర్‌గా కీర్తి మారనుంది. ‘మహానటి’లో సావిత్రి పాత్రలో అదరగొట్టిన ఆమె, నిజ జీవితంలోనూ సావిత్రి లాంటి బహుముఖ ప్రతిభ కనబరుస్తోంది. వ్యక్తిగత జీవితంలోనూ ఆమె ప్రాక్టికల్ ఆలోచన స్పష్టంగా కనిపిస్తోంది. తన భర్త గురించి మాట్లాడుతూ.. ఆయన సినిమా రంగంలోకి రారని, తనతో నటించే అవకాశం లేదని నవ్వుతూ చెప్పింది. ప్రొఫెషనల్, పర్సనల్ లైఫ్‌ను సమతూకం చేస్తూ తన కెరీర్‌ను తానే నడిపించుకుంటానన్న ఆత్మవిశ్వాసం ఆమెలో కనిపిస్తోంది. అలాగే మహిళల భద్రతపైనా ఆమె సీరియస్‌గా స్పందించింది. తనకు, సమంతకు సంబంధించిన డీప్‌ఫేక్ వీడియోలు చూసి భయపడ్డానని, విదేశాల్లో ఉన్నట్టు మన దేశంలోనూ కఠిన సైబర్ చట్టాలు రావాలని డిమాండ్ చేసింది.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *