Keerthy Suresh

Keerthy Suresh: ‘ఎల్లమ్మ’ నుంచి కీర్తి సురేష్ ఔట్!

Keerthy Suresh: ‘బలగం’ చిత్రంతో దర్శకుడిగా తన ప్రతిభను చాటిన వేణు యెల్దండి తాజాగా ‘ఎల్లమ్మ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఎమోషనల్ డ్రామాగా రూపొందిన ‘బలగం’ సంచలన విజయం సాధించిన నేపథ్యంలో, ‘ఎల్లమ్మ’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో నితిన్ హీరోగా నటిస్తుండగా, హీరోయిన్ పాత్ర ఇంకా ఖరారు కాలేదు.

గతంలో సాయి పల్లవి ఈ సినిమాలో నటిస్తుందనే వార్తలు వచ్చాయి, కానీ డేట్స్ సమస్యతో ఆమె తప్పుకుంది. ఆ తర్వాత కీర్తి సురేష్ ఈ పాత్రలో కనిపిస్తుందని జోరుగా ప్రచారం సాగింది. అయితే, తాజా సమాచారం ప్రకారం కీర్తి కూడా డేట్స్ అడ్జస్ట్ చేయలేక ఈ ప్రాజెక్ట్‌ను వదులుకున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి హీరోయిన్ ఎవరనేది ఇంకా సస్పెన్స్‌గా మిగిలింది. వేణు ఎవరిని ఫైనల్ చేస్తాడనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *