Ganapati Ladoo Auction

Ganapati Ladoo Auction: ఆల్‌ టైం రికార్డ్‌.. వేలంలో రూ.2.31కోట్లు పలికిన గణేష్‌ లడ్డూ.. ఎక్కడంటే..?

Ganapati Ladoo Auction: వినాయక చవితి ఉత్సవాలు అంటే ముంబై తర్వాత అందరికీ గుర్తుకు వచ్చేది మన హైదరాబాద్‌ భాగ్యనగరం. ఈ మహోత్సవంలో ఖైరతాబాద్ గణనాధుడి భవ్య విగ్రహం, బాలాపూర్ గణపతి లడ్డూ వేలం పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. దశాబ్దాలుగా బాలాపూర్ లడ్డూ వేలంలో రికార్డు ధరలు పలుకుతూ వస్తుండగా, ఇటీవలి సంవత్సరాల్లో నగరంలోని ఇతర ప్రాంతాలు కూడా ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ భక్తుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లాలోని గండిపేట మండలం, బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీర్తి రిచ్మండ్ విల్లాస్ గేటెడ్ కమ్యూనిటీ గణపతి లడ్డూ వేలం పాట సరికొత్త చరిత్ర సృష్టించింది. తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగిన గణేశ్ నవరాత్రి ఉత్సవాల అనంతరం నిర్వహించిన ఈ వేలంలో గణనాధుడి ప్రసాదం రూ.2 కోట్లు 31 లక్షల రూపాయలకు అమ్ముడవ్వడం సంచలనంగా మారింది.

ఇది కూడా చదవండి: Harish Rao: కవిత వ్యాఖ్యలపై స్పందించిన హరీష్ రావు..

గతేడాది ఇదే లడ్డూ రూ.1.87 కోట్లకు విక్రయించబడిన విషయం తెలిసిందే. ఈసారి రికార్డు బ్రేక్ చేసి కోట్ల రూపాయలకు లడ్డూ దక్కించుకున్న భక్తుడు సమాజంలో చర్చనీయాంశంగా మారాడు.

ఉత్సాహభరిత వాతావరణంలో డప్పులు, భజనలు, ఆటపాటలతో గణేశ్ శోభాయాత్ర జాతరలా కొనసాగింది. గణపతి లడ్డూను ఇంటికి తీసుకెళ్తే సుఖశాంతులు, ఐశ్వర్యాలు కలుగుతాయని విశ్వసించే భక్తులు ఈ వేలంలో తీవ్ర పోటీ పడ్డారు. నగరంలోని అనేక ప్రాంతాల్లో లడ్డూ వేలంపాటలు భారీ ధరలకు జరుగుతుండగా, కీర్తి రిచ్మండ్ విల్లాస్ లడ్డూ వేలం ఈసారి హాట్ టాపిక్‌గా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *