KCR: తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాలు నేడు అత్యంత ఆసక్తికరమైన పరిణామాల మధ్య ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన కొద్దిసేపటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకాగా, అందరి దృష్టి ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నేత కల్వకుంట్ల చంద్రశేఖర రావుపైనే నెలకొంది. గత కొంతకాలంగా అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉంటున్న కేసీఆర్, ఈరోజు అనూహ్యంగా అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకోవడంతో ఒక్కసారిగా రాజకీయ సందడి నెలకొంది.
అయితే, కేసీఆర్ సభలో పూర్తిస్థాయిలో పాల్గొంటారని అందరూ భావించినప్పటికీ, ఆయన కేవలం అసెంబ్లీ అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం చేసి సభ లోపలి వెళ్లి దివంగత సభ్యులుకు సంతాపం తెలిపి వెంటనే అక్కడి నుండి వెనుదిరగడం చర్చనీయాంశంగా మారింది.
ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి మధ్య అరుదైన దృశ్యం
ఈ సమావేశాల్లో మరో విశేషమైన ఘట్టం చోటుచేసుకుంది. అసెంబ్లీ ప్రాంగణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఒకరినొకరు ఎదురుపడటమే కాకుండా, మర్యాదపూర్వకంగా కరచాలనం చేసుకున్నారు. రాజకీయంగా ఇరు పక్షాల మధ్య తీవ్ర విమర్శలు నడుస్తున్న ప్రస్తుత తరుణంలో, వీరిద్దరి షేక్ హ్యాండ్ దృశ్యం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
ఇది కూడా చదవండి: Mexico Train Accident: మెక్సికోలో ఘోర రైలు ప్రమాదం: 13 మృతి, 100కి పైగా గాయాలు
దివంగత నేతలకు నివాళులు
సమావేశాలు ప్రారంభమైన అనంతరం, సభలో దివంగత మాజీ సభ్యులకు సంతాపం ప్రకటించారు. సభా నాయకుడు రేవంత్ రెడ్డితో పాటు ఇతర సభ్యులు దివంగత నేతల సేవలను స్మరించుకుంటూ మౌనం పాటించారు. కేసీఆర్ సభకు హాజరుకాకపోయినప్పటికీ, సభాపరమైన సంప్రదాయాల ప్రకారం సంతాప తీర్మానాల ప్రక్రియ కొనసాగింది.
మొత్తానికి, శీతాకాల సమావేశాల తొలిరోజే కేసీఆర్ రాక, సీఎం రేవంత్ రెడ్డితో కరచాలనం వంటి పరిణామాలు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
