KCR: బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చండీయాగం నిర్వహించబోతున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ సమీపంలోని ఎర్రవల్లిలో ఉన్న తన పామ్‌హౌజ్‌లో ఆయన ఈ యాగం నిర్వహించబోతున్నారు. ఈ రోజు (సెప్టెంబర్ 5) ఉదయం 11.30 గంటలకు చండీయాగం క్రతువు ప్రారంభమై ఇదేరోజు సాయంత్రం 5.30 గంటలకు ముగుస్తుందని తెలుస్తున్నది.
KCR: ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌజ్‌లో చండీయాగం నిర్వహణకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిసింది. ఈ యాగంలో ప్రధానంగా కేసీఆర్, శోభ దంపతులు పాల్గొననున్నారు. యాగం నిర్వహణకు మొత్తంగా 15 మంది రుత్వికులు హాజరవనున్నారని సమాచారం. బీఆర్ఎస్ ఓటమి, కుటుంబం గొడవలు లాంటి ప్రతికూల పరిస్థితుల్లో సర్దుకునేందుకే ఈయాగం నిర్వహిస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
KCR: వాస్తవంగా బీఆర్ఎస్ పార్టీకి రాజకీయంగా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒకవైపు ఫోన్ ట్యాపింగ్, విద్యుత్తు కొనుగోళ్ల కేసులు పెండింగ్‌లో ఉండగా, తాజాగా కాళేశ్వరం విచారణ పేరిట,కవిత ఎపిసోడ్‌తో బీఆర్ఎస్ నేతలకు ముఖ్యంగా కేసీఆర్‌కు ప్రతికూల వాతావరణం గోచరిస్తున్నది. ఈ పరిస్థితుల్లో చండీయాగం నిర్వహిస్తే పరిస్థితులు చక్కబడతాయని వేదపండితులు కొందరు సూచించడంతోనే కేసీఆర్ దీనికి పూనుకున్నారని చెప్తున్నారు.
KCR: ఇటీవలి పరిణామాలతో కేసీఆర్ గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలతో ఎర్రవల్లి ఫామ్‌హౌజ్‌లోనే చర్చలు జరుపుతున్నారు. ఆయన తనయుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా కొన్నాళ్లుగా అక్కడే ఉన్నట్టు సమాచారం. ముఖ్యంగా కవిత వ్యాఖ్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కీలక నేతలు సమాలోచనలు జరుపుతూ వస్తున్నారు.
KCR: కేసీఆర్ నిర్వహించే చండీయాగంలో మాజీ మంత్రులైన ఎర్రబెల్లి దయాకర్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ప్రశాంత్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి తదితరులు పాల్గొంటారని సమాచారం. గత ఆగస్టు నెల 6వ తేదీనే అదే ఎర్రవల్లి ఫామ్‌హౌజ్‌లో ఈ చండీయాగం నిర్వహించాల్సి ఉండగా, కేసీఆర్‌కు అనారోగ్యం కారణంగా ఈ రోజుకు వాయిదా పడిందని తెలిసింది.

