KCR: బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి నేటికి (ఏప్రిల్ 27) 25 ఏండ్లు పూర్తిచేసుకున్నది. రజతోత్సవ వేడుకలకు ఆ పార్టీ సిద్ధమైంది. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ రోజు సాయంత్రం భారీ బహిరంగసభతో వేడుకలకు శ్రీకారం చుట్టనున్నది. ఏడాదిపాటు రజతోత్సవ కార్యక్రమాలు నిర్వహించనున్నది. ఈ నేపథ్యంలో రజతోత్సవ బహిరంగ సభలో కేసీఆర్ ఏం మాట్లాడుతారు అన్న విషయాలపై అంతటా ఆసక్తి నెలకొన్నది.
KCR: రాజకీయ ప్రసంగంలో కేసీఆర్‌కు ఆయనే సాటి. తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన అంతగా రాజకీయ పరిణతి చెందిన, విలక్షణ నేతగా మరొకరు లేరని రాజకీయ విశ్లేషకుల అంచనా. ఆయన అంతలా వాక్చాతుర్యం మరొకరికి లేదనేది వాస్తవం. కేసీఆర్ సభలో మాట్లాడినా, ప్రెస్‌మీట్ పెట్టినా.. బీఆర్ఎస్ శ్రేణులే కాదు, విమర్శకులు సైతం ఆసక్తిగా వింటారని అంటుంటారు.
KCR: కేసీఆర్ కరీంనగర్, వరంగల్, నల్లగొండ, మహబూబ్‌నగర్ ప్రాంతాల్లో గతంలో భారీ బహిరంగ సభలు పెట్టి సంచలన విషయాలను ప్రకటించారు. ఆయా సభల్లోనే ఉద్యమంనాడు పదవులకు రాజీనామా నిర్ణయాలు తీసుకున్నారు. ఉద్యమ పంథాను ప్రకటించారు. ఆమరణ దీక్షలాంటి సంచలన విషయాలను ఆయన ప్రకటించి ప్రజలను సమ్మోహనం చేశారు.
KCR: ప్రస్తుతం కేటీఆర్ ఓటమి నుంచి ఇంకా తేరుకోలేదని విమర్శకులు అంటుంటారు. అలాంటి దశలో ఆయన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక, లోక్‌సభ ఎన్నికలు మినహా ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానేలేదు. ఏడాదిన్నర కాలంలో ఆయన ఇంటికే పరిమితం అయ్యారు. ఈ నేపధ్యంలో ఎల్కతుర్తిలో జరిగే పార్టీ బహిరంగ సభతోనే ఆయన జనం ముందుకు వస్తున్నారు. ఈ దశలో ఆయన ప్రసంగంలో ఏదో కీలక పరిణామం చోటుచేసుకుంటుందని అందరూ భావిస్తున్నారు.
KCR: ఇక్కడ మూడు విషయాలపై జనంలో ఆసక్తిని కల్పిస్తున్నాయి. బీఆర్ఎస్ ఓటమి తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రేవంత్‌రెడ్డి సీఎంగా కొనసాగుతున్నారు. ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ రెండు సార్లు మినహా హాజరు కాలేదు. ఈ దశలో సీఎం రేవంత్‌రెడ్డి పార్టీ మీటింగ్‌లలో, ప్రభుత్వ వైదికలల్లో, చిట్‌చాట్‌లో, అసెంబ్లీ మీటింగుల్లో పలుమార్లు కేసీఆర్‌పై పరుష పదజాలాన్ని వాడారు. ఆ భాషపై ప్రజల్లో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
KCR: ఆశువుగా అన్నా, అలవోకగా అన్నా తప్పు తప్పేనని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిక చేశారు. కేసీఆర్ వయసుకు అయినా రేవంత్‌రెడ్డి గౌరవం ఇవ్వాలని పలువురు సూచనలు చేశారు. ఏకంగా ఆయనకు వంతపాడే మీడియా కూడా ఇలాంటి సూచనలే చేసింది. ఇంతవరకు తనపై చేసిన పరుష వ్యాఖ్యలపై కేసీఆర్ స్పందించనేలేదు. ఈ నేపథ్యంలో జరిగే ఎల్కతుర్తి సభలో కేసీఆర్.. రేవంత్‌రెడ్డి పరుష వ్యాఖ్యలపై స్పందించి గట్టి సమాధానాలు చెప్తారని బీఆర్ఎస్ శ్రేణులు, ఆయన అభిమానులు భావిస్తున్నారు.
KCR: ఇక మరో విషయం ఏమిటంటే.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై కేటీఆర్, హరీశ్‌రావు స్పందిస్తూ వచ్చినా, కేసీఆర్ మాత్రం మౌనంగానే ఉన్నారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, పంట నష్టపరిహారం, హైడ్రా, మూసీ అంశాల్లో కేసీఆర్ మౌనం వీడుతారని, ప్రభుత్వానికి గట్టి సమాధానం ఇస్తారని, పార్టీ విధానం ప్రకటించి ప్రజాపోరాటాలకు శ్రీకారం చుడుతారని ప్రజలు భావిస్తున్నారు.
KCR: మూడో విషయం ఏమిటంటే? గతంలో ఉద్యమ సమయంలో పలుమార్లు ఎంపీ, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి మళ్లీ పోటీ చేసి తెలంగాణ ఉనికిని చాటేందుకు కేసీఆర్ కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. ఈనాడు కూడా అవే నిర్ణయాలు ఏమైనా తీసుకుంటారా? అన్న విషయాలపైనా రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా మీడియాలోనూ, రాజకీయ విశ్లేషకుల్లోనూ ఆసక్తి నెలకొన్నది.
KCR: ఇక్కడ రెండు విషయాలను పరిగణనలోకి తీసుకోవచ్చు. ఉన్న ఎమ్మెల్యేలందరిచేత రాజీనామా చేయించి, మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని భావిస్తే, ఇదే వేదికపై ప్రకటిస్తారని ఊహిస్తున్నారు. ఈ తరుణంలో ప్రజావ్యతిరేకత కారణంగా బీఆర్ఎస్ గెలుపు నల్లేరుపై నడకేనని భావించవచ్చని భావించి, రాజీనామా నిర్ణయాన్ని ప్రకటిస్తారని అనుకుంటున్నారు. ఒకవేళ ఇలా చేస్తే ప్రజావ్యతిరేకత బీజేపీకి క్యాష్ అయితే అన్న ఆలోచన కూడా కేసీఆర్‌కు వచ్చి ఉంటుందని అనుకుంటున్నారు.
KCR: ఒకవేళ అలాంటి ఆలోచన వచ్చి ఉంటే కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు రాజీనామాలను కేసీఆర్ ప్రకటించి, ముందు ఆ మూడు స్థానాల్లో ఎన్నికలకు వెళ్తే ఎలా అన్నది కూడా కేసీఆర్ మదిలో ఉన్నదని ఊహిస్తున్నారు. ఒకవేళ అలా భావిస్తే గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల స్థానాల్లో ఉప ఎన్నికలకు వెళ్లి, వాటి పర్యవసానాలను బట్టి మిగతా స్థానాలపై కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని అంచనా వేస్తున్నారు.