Kcr: తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మాజీ సీఎం, భారత రాష్ట్ర సమితి (BRS) అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు మౌనంగా ఉన్నానని, కానీ ఇప్పుడు సీరియస్‌గా పరిశీలిస్తున్నానని ఆయన వెల్లడించారు.
ప్రత్యక్ష పోరాటాలకు సైగ
కేసీఆర్ మాట్లాడుతూ, “నేను కొడితే మాములుగా ఉండదు” అంటూ సూటిగా హెచ్చరించారు. రాబోయే రోజుల్లో విజయం తమదేనని విశ్వాసం వ్యక్తం చేశారు. “మన విజయం, తెలంగాణ ప్రజల విజయం కావాలి.” “ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధంగా ఉండండి.” అని అన్నారు.కేసీఆర్ తన ప్రసంగంలో భూముల ధరలు అమాంతం పడిపోయాయని ప్రస్తావించారు.
ఫిబ్రవరిలో భారీ సభ – రాజకీయ భవిష్యత్‌పై స్పష్టత?
ఫిబ్రవరి నెలాఖరున భారీ సభ ఏర్పాటు చేస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. ఈ సభలో పార్టీ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నారా? కేసీఆర్ తాజా వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠను పెంచాయి. ఫిబ్రవరిలో జరిగే భారీ సభలో ఏం జరుగుతుందో, ఆయన ఏ విధమైన ప్రకటన చేస్తారో వేచి చూడాల్సిందే.
