KCR: బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసంలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా 7జరిగాయి. రాఖీ పూర్ణిమ సందర్భంగా ఆయన అక్కలు లక్ష్మీబాయి, జయమ్మ, చెల్లెలు వినోదమ్మ కేసీఆర్‌కు రాఖీ కట్టారు. కేసీఆర్ ఆరోగ్యంగా, దీర్ఘాయుష్మంతుడిగా ఉండాలని వారు ఆకాంక్షిస్తూ మిఠాయిలు తినిపించారు. ఈ సందర్భంగా కేసీఆర్ సతీమణి శోభమ్మతో పాటు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
రాఖీ కట్టిన అనంతరం కేసీఆర్ తన అక్క లక్ష్మీబాయి కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. సోదరీమణులకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు.