Kavitha

Kavitha: బీఆర్ఎస్ కు పూర్వ వైభవం రావాలంటే కేసీఆర్ అసెంబ్లీ రావలిసిందే

Kavitha: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరు కావాల్సిన అవసరాన్ని ఆమె నొక్కి చెప్పారు. కేసీఆర్ స్వయంగా సభకు వచ్చి తన గళాన్ని వినిపిస్తేనే బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు ఉంటుందని, లేనిపక్షంలో పార్టీ మనుగడ కష్టమని ఆమె అభిప్రాయపడటం విశేషం. పార్టీ మనుగడ సాగించాలన్నా, క్షేత్రస్థాయిలో కేడర్‌లో ధైర్యం నింపాలన్నా గులాబీ బాస్ అసెంబ్లీలో అడుగుపెట్టక తప్పదని ఆమె పరోక్షంగా హెచ్చరించారు.

ఇదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కవిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్‌ను ఉద్దేశించి రేవంత్ రెడ్డి చేసిన ‘ఉరితీయాలి’ అనే వ్యాఖ్యలు అత్యంత అభ్యంతరకరంగా ఉన్నాయని ఆమె మండిపడ్డారు. ఒక ఉద్యమ నాయకుడిని పట్టుకొని ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి భాష వాడటం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: Andhra Pradesh: జీఎస్టీ వసూళ్లలో ఆంధ్రప్రదేశ్ సరికొత్త రికార్డు!

రేవంత్ మాటలు విన్నప్పుడు కేసీఆర్ బిడ్డగా తన రక్తం మరిగిపోయిందని ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ తప్పులు చేసిందని విమర్శించే రేవంత్, అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రాజెక్టును జూరాలకు ఎందుకు మార్చలేదని ఆమె ప్రశ్నించారు.

మరోవైపు సొంత పార్టీ నేతలపై కూడా ఆమె ఘాటు విమర్శలు చేశారు. ట్రబుల్ షూటర్‌ (హరీష్ రావు) ప్యాకేజీలకు అమ్ముడుపోయారని ఆమె ఆరోపించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కలిసి ప్రజలను మోసం చేస్తున్నాయని ఆమె విమర్శించారు. తన ఎమ్మెల్సీ పదవికి సెప్టెంబర్ 3నే రాజీనామా చేసినప్పటికీ, ఇంతవరకు ఎందుకు ఆమోదించలేదో తెలుసుకోవడానికే తాను మండలికి వచ్చానని కవిత స్పష్టం చేశారు. మొత్తానికి కవిత చేసిన ఈ వ్యాఖ్యలు  రాజకీయ వర్గాల్లో కొత్త చిచ్చు రేపాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *