Kavitha: బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను నిన్న సస్పెండ్ చేసిన నేపథ్యంలో ఈ రోజు ఆమె మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కవిత చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి.
మా నాన్న కేసీఆర్ గారి కలల తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడమే. కానీ హరీష్ రావు ఇంట్లో బంగారం ఉంటేనే బంగారు తెలంగాణ అవుతుందా?” అని కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ అంతర్గత పరిస్థితులపై కవిత చేసిన ఈ వ్యాఖ్యలు బీఆర్ఎస్‌లో గల విభేదాలను మరింత బహిర్గతం చేస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.