BRS: “ఎమ్మెల్సీ కవిత ఇటీవల కాలంలో ప్రవర్తిస్తున్న తీరు, కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్కి నష్టం కలిగించే రీతిలో ఉన్నందున తీవ్రంగా పరిగణిస్తున్నాం. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు కవితను తక్షణం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నాం.” – బీఆర్ఎస్ అధికారిక లేఖ
ఈ నిర్ణయం బహిరంగం కావడంతో రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేగింది. కవితపై చర్య తీసుకోవడం పార్టీ అంతర్గత పరిణామాలకు సంకేతమని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి
కాగా, అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు ఆమెను బీఆర్ఎస్ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇటీవల కవిత చేసిన వ్యాఖ్యలు పార్టీకి నష్టం కలిగించే విధంగా ఉన్నాయని, వాటి వల్ల బీఆర్ఎస్ ప్రతిష్ట దెబ్బతిందని భావించిన పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బీఆర్ఎస్ అధికార ప్రతినిధులు కవితను సస్పెండ్ చేస్తున్నట్లు స్పష్టమైన లేఖను విడుదల చేశారు.