Kavita: సుప్రీంకోర్టుకు కవిత లేఖ – తెలంగాణ గ్రూప్–1 పరీక్ష రద్దు డిమాండ్ Kavita: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. ఆమె లేఖలో గ్రూప్–1 నియామకాల్లో అవకతవకలు జరిగాయని, రాష్ట్రపతి ఉత్తర్వులను ఉల్లంఘించారని ఆరోపించారు. ఈ అంశాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి విచారణ జరపాలని కోరారు. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్లో శిల్పకళావేదికలో 562 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసిన నేపథ్యంలో ఈ లేఖ ప్రాధాన్యం సంతరించుకుంది. కవిత పేర్కొన్న ముఖ్యాంశాలు: తెలుగు మీడియం విద్యార్థులకు అన్యాయం జరిగిందని ఫిర్యాదులు అందాయని చెప్పారు.ప్రశ్నాపత్రాల అనువాదంలో లోపాలు ఉన్నందున మార్కుల్లో భారీ వ్యత్యాసాలు వచ్చాయని తెలిపారు. ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలకు వేర్వేరు హాల్ టికెట్ నంబర్లు ఇవ్వడం అనుమానాస్పదమని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో గ్రూప్–1 పరీక్షను రద్దు చేసి న్యాయ విచారణ జరపాలని ఆమె డిమాండ్ చేశారు. తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు