KAVITA: “తెలంగాణ ఉద్యమంలో ఒక్క అడుగూ వేసనివారే ఇప్పుడు సీఎం అయ్యారు. అవతరణ దినోత్సవం రోజైనా ‘జై తెలంగాణ’ అనలేకపోతే వారికి ఆ పదవికి అర్హత లేదు. అమరవీరులకు నివాళులర్పించకపోవడం బాధాకరం” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజీవ్ యువ వికాస పథకంపై మాట్లాడుతూ, “ఆ పథకానికి అమరవీరుల పేరు పెడితే ఏమి అవుతుందని ప్రశ్నించారు. తెలంగాణకు సంబంధం లేని రాజీవ్ గాంధీ పేరు పెట్టడం ఏంటని” మండిపడ్డారు.
అంతేకాకుండా, “ఏపీ సీఎం చంద్రబాబు బనకచర్ల ద్వారా గోదావరి నీటిని తరలిస్తుంటే సీఎం రేవంత్ ఎందుకు మౌనంగా ఉన్నారు? ఏపీ ప్రయోజనాలకే ఆయన పని చేస్తున్నారా?” అని సంశయం వ్యక్తం చేశారు.
బీసీ బిల్లుపై కేంద్రంపై ఒత్తిడి
“బీసీలకు విద్య, ఉద్యోగాల్లో 45 శాతం రిజర్వేషన్ల కోసం తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. ఇప్పటికైనా పార్లమెంట్‌లో బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలి. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా రైల్‌రోకో చేపడతాం,” అని బీజేపీ నేతలకు కవిత హెచ్చరించారు.
మహిళల హక్కులు, దళితుల కోసం పోరాటం
“ఎన్నికల ముందు ప్రతి మహిళకు రూ.2,500 ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు అమలుచేయలేదు. ఆ హామీ నెరవేరు చేసే వరకు జాగృతి పోరాటం చేస్తుంది,”** అని స్పష్టం చేశారు.
అలాగే, “దళితుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ఎస్సీ విభాగాన్ని ఏర్పాటు చేసి పోరాటం చేస్తాం. మైనార్టీల హక్కుల రక్షణ కోసం కూడా నిరంతరం పోరాడతాం,” అని తెలిపారు.
జూన్ 4న ఆందోళనలు
కవిత చివరగా “కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ నోటీసు కేసీఆర్‌కు ఇచ్చిన నేపథ్యంలో జూన్ 4న రాష్ట్రవ్యాప్తంగా భారీ ఆందోళనలు చేపడతాం,” అని ప్రకటించారు. భవిష్యత్తులో జాగృతి సంస్థను మరింత విస్తరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.