Katrina Kaif

Katrina Kaif: దీపికాని వెనక్కి నెట్టి తుఫాన్లా దూసుకుపోతున్న కత్రినా!

Katrina Kaif: కత్రినా కైఫ్ తన బ్యూటీ బ్రాండ్ కే బ్యూటీతో మార్కెట్‌లో దూసుకెళ్తోంది. 2019లో నైకాతో కలిసి ప్రారంభించిన ఈ బ్రాండ్, ఆరు సంవత్సరాల్లో రూ.240 కోట్ల ఆదాయంతో దేశంలోని టాప్ కాస్మెటిక్ బ్రాండ్‌గా నిలిచింది. 2018లో నైకాతో జాయింట్ వెంచర్‌లో రూ.2.04 కోట్ల పెట్టుబడితో మొదలై, 2021 నాటికి రూ.22 కోట్లకు చేరింది. నాణ్యమైన ఉత్పత్తులు, తెలివైన పెట్టుబడులతో కత్రినా మార్కెట్‌లో ఆధిపత్యం సాధించింది. ఆమె ముంబై, లండన్‌లో విలాసవంతమైన ఇళ్లు, ఖరీదైన కార్లను సొంతం చేసుకుంది. మరోవైపు, దీపికా పదుకొనే బ్రాండ్ 82 డిగ్రీ E, 2024లో తొమ్మిది నెలల్లో రూ.25.1 కోట్ల నష్టాన్ని చవిచూసింది. అధిక ధరలు, నాణ్యతలో లోపాలే దీపికా వైఫల్యానికి కారణమని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. కృతి సనన్, మసాబా గుప్తా లాంటి సెలబ్రిటీల బ్రాండ్‌లు కూడా కత్రినా స్థాయిని అందుకోలేకపోయాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *