Karnool:

Karnool: ర‌థోత్స‌వంలో అప‌శృతి

Karnool: క‌ర్నూలు జిల్లాలో జ‌రిగిన ర‌థోత్స‌వంలో అప‌శృతి చోటుచేసుకున్న‌ది. ఈ ఘ‌ట‌న‌లో ప‌లువురికి తీవ్ర‌గాయ్యాయి. ఒకరి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ద‌ని తెలిసింది. క‌ర్నూలు జిల్లా ఎమ్మిగ‌నూరు మండ‌లం కంద‌నాతి గ్రామంలో చెన్న‌కేశ‌వ స్వామి ఆల‌య ర‌థాన్ని కొండ‌పైకి తీసుకెళ్తుండ‌గా.. ఆ ర‌థం ప‌క్క‌కు ఒరిగి ప‌డిపోయింది. ప‌లువురు భ‌క్తుల‌పై ఒక్క‌సారిగా ఆ ర‌థం ప‌డ‌టంతో ప‌లువురు గాయాల‌పాల‌య్యారు. వారిలో ఒక‌రి ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌రంగా ఉండ‌టంతో వెంట‌నే ఆసుప‌త్రికి త‌ర‌లించారు. క్ష‌త‌గాత్రుల‌ను కూడా ఆసుప‌త్రికి త‌ర‌లించి వైద్య చికిత్స‌లు అందిస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *