Karnataka: ఇటీవల సమాజ గమనం మారుతున్నది. ఎక్కువ మందిలో అసహనం పెరిగిపోతున్నది. ఓపిక, సహనం అనేది ఆవగింజంత కూడా ఉండటం కలగడం లేదు. దీంతో క్షణికావేశంతో ఎందరో బలవుతున్నారు. మరెందరో అమానుష చర్యలకు గురవుతున్నారు. ఇక్కడ కూడా ఆవేశంతో ఓ ఉపాధ్యాయుడు, అతని భార్య ఓ దివ్యాంగుడైన విద్యార్థిపై మానవత్వాన్ని మరిచి అమానుష దాడికి పాల్పడ్డారు.
Karnataka: కర్ణాటక రాష్ట్రం ఉత్తర ప్రాంతంలోని బాగల్‌కోట్‌లో నవగర్ లో ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం ఏర్పాటు చేసిన రెసిడెన్షియల్ పాఠశాల ఉన్నది. ఆ పాఠశాలలో 16 ఏళ్ల వయసున్న దివ్యాంగుడైన విద్యార్థిని విచక్షణారహితంగా కొట్టారు. ఆ పాఠశాల ఉపాధ్యాయుడు ఆ విద్యార్థిని బెల్ట్, ప్లాస్టిక్ పైపుతో తోటి పిల్లల ఎదుట తీవ్రంగా చావబాదాడు.
Karnataka: ఆ బాలుడు కొట్టొద్దంటూ విలపిస్తున్నా వినకుండా, ఆ ఉపాధ్యాయుడి భార్య కారం తెచ్చి కళ్లల్లో పోసింది. ఆ ఉపాధ్యాయుడు కొడుతుండగా, పక్కనే ఉండి నవ్వుకుంటూ మరో వ్యక్తి వీడియో తీశాడు. ఈ విషయం తెలిసిన ఆ బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
