Karnataka: కొంతమంది డబ్బు కోసం ఎలాంటి పనైనా చేస్తారు. అది రూపాయి అయినా సరే దానికోసం నీచంగా ప్రవర్తిస్తారు. తప్పు చేసినవారిని పట్టుకోవాల్సిన పోలీసుల్లో కూడా అలాంటి వారు చాలామందే ఉంటారు. ఇదిగో ఈ పోలీసాయన కూడా అంతే.. కక్కుర్తికి ఖాకీ బట్టలు వేసినట్టున్నాడు. ఆ స్టోరీ తెలుసుకుందాం..
కర్ణాటకకు చెందిన 28 ఏళ్ల విజయ్ ఇంటింటికీ వెళ్లి పాత బట్టలు, వస్తువులను సేకరించి అనాథ శరణాలయాలకు అందచేస్తుంటారు. మార్చి 31న, అతను విల్లిజ్నం ప్రాంతంలో ద్విచక్ర వాహనంపై కూర్చున్నాడు. ఆ సమయంలో అనుకోకుండా అటుగా వెళ్తున్న తిరువనంతపురం పట్టం అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ట్రాఫిక్ ఆఫీస్ SI ప్రదీప్ విజయ్ అతన్ని అక్కడ ఎందుకున్నావంటూ అడిగాడు.
ఆ ప్రాంతంలోని ఇళ్ల నుంచి పాత బట్టలు, వస్తువులు కొనడానికి వచ్చానని విజయ్ చెప్పాడు. కొద్దిసేపు అతని వివరాలు అడిగినట్టుగా మాట్లాడిన ఎస్సై అతని ఐడీ చూపించమని అడిగాడు. దీంతో విజయ్ తన పర్సులోని ఐడీకార్డులు తీయడానికి ప్రయత్నించాడు. ఏ సమయంలో ఇ SI అకస్మాత్తుగా విజయ్ పర్సు తీసుకొని తన బైక్ పై వెళ్ళిపోయాడు. దీంతో. విజయ్ విజింజమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. SI ప్రదీప్ తన పర్సులో రూ. 1,05,000 తీసుకెళ్లాడని ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు
Also Read: YCP Dramalu: జగన్ డ్రామాలపై ముస్లిం సమాజంలో ఆగ్రహం!
Karnataka: ఇప్పుడు ఎస్సై పై కేసు నమోదు చేశారు. తిరువనంతపురం పోలీస్ కమిషనర్ థాంప్సన్ జోస్ అతన్ని విధుల నుండి సస్పెండ్ చేస్తూ ఆదేశించారు. అంతేకాకుండా ఆ ఎస్సై పై శాఖాపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు.