Karnataka news:

Karnataka news: క‌ర్ణాట‌క డీజీపీ హ‌త్యకేసులో వెలుగులోకి సంచ‌ల‌న విష‌యాలు.. న‌మ్మించి చంపిన భార్య‌, కూతురు.. హ‌త్య‌కు కార‌ణాల‌ను వెల్ల‌డించిన పోలీసులు

Karnataka news: క‌ర్ణాట‌క మాజీ డీజీపీ ఓంప్ర‌కాశ్ (58) హ‌త్య విష‌యంలో కీల‌క విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. ఆయ‌న‌ను హ‌త్య చేయాల‌ని భార్య క‌సి పెంచుకోవ‌డానికి గ‌ల కార‌ణాలు వెల్ల‌డ‌య్యాయి. సుమారు 12 గంట‌ల పాటు విచారించిన పోలీసుల‌కు అస‌లు విష‌యాలు తెలిశాయి. ఓంప్ర‌కాశ్ భార్య‌, కూతురు నుంచి కీల‌క విష‌యాల‌ను పోలీసులు రాబ‌ట్ట‌గ‌లిగారు. 1981 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి అయిన ఓంప్ర‌కాశ్‌, 2015లో డీజీపీగా ప‌నిచేస్తూ ఉద్యోగ విర‌మ‌ణ పొందారు.

Karnataka news: త‌న భ‌ర్త ఓం ప్ర‌కాశ్‌ను చంపేందుకు అత‌ని భార్య ప‌ల్ల‌వి, కూతురు కృతి గూగుల్‌లో సెర్చ్ చేసిన‌ట్టు పోలీసుల‌కు వెల్లడించారు. హ‌త్య‌కు ఐదు రోజుల ముందు నుంచే మ‌నిషికి ఎక్క‌డ న‌రాలు తెగితే చ‌నిపోతాడోన‌ని గూగుల్‌లో వారు వెతికిన‌ట్టు చెప్పారు. ఓంప్ర‌కాశ్‌ను చంపాక.. దుర్మార్గుడిని చంపేశా.. అంటూ వాట్స‌ప్‌లో ప‌లువురికి అత‌ని భార్య‌ ప‌ల్ల‌వి మెసేజ్ చేసిన‌ట్టు తేలింది.

Karnataka news: ఓప్ర‌కాశ్ త‌న‌ను, త‌న కూతురిని తీవ్రంగా హింసించాడ‌ని ప‌ల్ల‌వి ఆరోప‌ణ‌లు చేసింది. త‌మ‌ను ఒక గదిలో బంధించి ఉంచాడ‌ని పోలీసుల విచార‌ణ‌లో ప‌ల్ల‌వి తెలిపింది. ఓంప్ర‌కాశ్ త‌న కొడుకుతో, త‌న చెల్లితో ఎక్కువ‌గా ఉండేవాడ‌ని వారు తెలిపారు. అదే విధంగా దండేలి వ‌ద్ద ఉన్న 17 ఎక‌రాల భూమిని కూడా త‌న కొడుకు, చెల్లి పేర‌ట రాసేందుకు సిద్ధ‌మ‌య్యాడ‌ని వారు తెలిపారు.

Karnataka news: త‌మ‌ను తీవ్రంగా హింసిండంతోపాటు త‌మ‌కు ఆస్తిలో వాటా ఇవ్వ‌క‌పోవ‌డంతోనే తాము ఓం ప్ర‌కాశ్‌ను చంపిన‌ట్టు అత‌ని భార్య ప‌ల్ల‌వి, కూతురు కృతి పోలీసుల విచార‌ణ‌లో తేల్చి చెప్పారు. కొంత ఆస్తిని సోద‌రికి బ‌దిలీ చేయ‌డంతోనే ఇంటిలో గొడ‌వలు మొద‌ల‌య్యాయ‌ని పోలీసుల విచార‌ణ‌లో తేలింది. దీంతో ఆ గొడ‌వలు హ‌త్య వ‌ర‌కు దారితీసింద‌ని తెలిపారు.

Karnataka news: ఓంప్ర‌కాశ్ భోజ‌నం చేస్తుండ‌గా, త‌ల్లీకూతుళ్లు ఆయ‌న‌ను క‌ళ్ల‌ల్లో కారం కొట్టి, ఆయిల్ పోసి తాళ్ల‌తో కట్టేశార‌ని పోలీసులు విచార‌ణ తెలిసింది. ఆపై క‌డుపు, ఛాతీలో 12 సార్లు క‌త్తుల‌తో పొడిచి చంపేశారు. ఇందుకు రెండు క‌త్తుల‌తోపాటు ఓ గాజు సీసాను కూడా వాడిన‌ట్టు పోలీసులు గుర్తించారు.

Karnataka news: ఇదిలా ఉండ‌గా, ఓ ప్ర‌కాశ్ కొడుకు కార్తికేశ్ పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతోనే పోలీసులు కేసు న‌మోదు చేశారు. త‌మ త‌ల్లిదండ్రుల మ‌ధ్య ఆస్తి విష‌యంలో గొడ‌వ‌లు ఉన్నాయ‌ని తెలిపారు. త‌న తండ్రి హ‌త్య‌లో త‌న త‌ల్లి, చెల్లి పాత్ర ఉన్న‌ట్టు ఆయ‌న పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. నాన్న‌ను చంపేస్తాన‌ని వారం నుంచి త‌న త‌ల్లి బెదిరించింద‌ని, దీంతో నాన్న మా మేన‌త్త ఇంటికి వెళ్లాడ‌ని తెలిపారు. రెండు రోజుల క్రితం నాన్న వ‌ద్ద‌కు చెల్లి వెళ్లి ఒత్తిడి చేయ‌డంతోనే ఆయ‌న ఇంటికి వ‌చ్చార‌ని తెలిపారు. ఆ మ‌రుస‌టి రోజే ఈ ఘోరం జ‌రిగింద‌ని కార్తికేశ్ పోలీసుల ఫిర్యాదులో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *