Nandini Ghee

Nandini Ghee: షాక్: నందినీ నెయ్యి ధర భారీగా పెంపు!

Nandini Ghee: కర్ణాటకకు చెందిన ప్రముఖ పాల ఉత్పత్తుల సంస్థ కర్ణాటక మిల్క్‌ ఫెడరేషన్‌ (KMF), తన ప్రధాన ఉత్పత్తి అయిన నందినీ నెయ్యి ధరను భారీగా పెంచుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ నిర్ణయం వినియోగదారులకు, ముఖ్యంగా పండుగల సీజన్‌లో పెద్ద షాక్‌గా మారింది. నందినీ నెయ్యి ధరను లీటరుకు ఏకంగా రూ. 90 పెంచుతున్నట్లు KMF ఒక ప్రకటనలో వెల్లడించింది.

Also Read: PM Narendra Modi: టీమిండియా మ‌హిళా జ‌ట్టుతో ప్ర‌ధాని ఏమ‌న్నారో తెలుసా?

ఈ పెంపుతో లీటరు నందినీ నెయ్యి ధర ₹520 నుంచి దాదాపు ₹610కి పెరిగే అవకాశం ఉంది. పెరిగిన ఈ ధరలు ఈ రోజు నుంచే తక్షణమే అమల్లోకి వస్తాయని KMF తెలిపింది. పాలు, పాల కొవ్వు ధరలు మార్కెట్‌లో గణనీయంగా పెరగడం వల్ల ఉత్పత్తి ఖర్చు పెరిగిందని, ఈ భారాన్ని భక్తులపై మోపక తప్పడం లేదని KMF అధికారులు వివరించారు. ప్రస్తుతం నెయ్యి ధర మాత్రమే పెరిగినట్లు, ఇతర పాల ఉత్పత్తులు (పాలు, పెరుగు) ధరలు యథాతథంగా ఉన్నట్లు KMF స్పష్టం చేసింది. కర్ణాటకలోనూ, ఇతర రాష్ట్రాలలోనూ నందినీ నెయ్యికి విశేష ఆదరణ ఉంది. ముఖ్యంగా ఇది పండుగలు, పడిపూజలు, యజ్ఞాలు మరియు తీపి వంటకాల తయారీలో కీలకం. ఈ ధరల పెంపుతో గృహ వినియోగదారులపై ఆర్థిక భారం పడనుంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *