CM Siddaramaiah: బెంగళూరులో రోడ్ల దుస్థితిపై విమర్శలు వ్యక్తమవుతున్న వేళ…కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కీలక నిర్ణయం తీసుకున్నారు. నగరంలో ఉన్న రోడ్లపై గుంతలను వారం రోజుల్లోగా పూడ్చేయాలని అధికారులను ఆదేశించారు. గాంధీనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో వైట్ టాపింగ్ సహా రోడ్ల సమగ్రాభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టులను సిద్ధరామయ్య ప్రారంభించారు.ఈ ఏడాది వర్షాలు ఎక్కువగా పడటంతో రహదారుల మరమ్మతుల పనులు ఆలస్యం అవుతున్నాయని సిద్ధరామయ్య తెలిపారు. గుంతల సమస్యను నివారించేందుకు నగరంలో వివిధ చోట్ల వైట్ టాపింగ్ పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. దీని వల్ల 25 నుంచి 30 ఏళ్ల వరకు రోడ్లకు ఎలాంటి సమస్యలు ఉండవని అన్నారు. నియోజకవర్గాల అభివృద్ధి కోసం ఎమ్మెల్యేలకు…8 వేల కోట్ల రూపాయల నిధులను కేటాయిస్తున్నామని సిద్ధరామయ్య తెలిపారు. ఇప్పటికే బెంగళూరులోని ఐదు కార్పొరేషన్ల పరిధిలో గుంతల రోడ్ల మరమ్మత్తు పనులను పూర్తిచేయడానికి అక్టోబర్ 31ని చివరి తేదీగా నిర్ణయిస్తూ సీఎం ఆదేశాలు జారీ చేశారు..