Crime News: బెంగళూరు గ్రామీణ జిల్లాలోని దేవనహళ్లి తాలూకా ఒక గ్రామంలో హృదయ విదారక సంఘటన చోటుచేసుకుంది. ప్రీతమ్ (19) అనే యువకుడిని దుండగులు కారులో కిడ్నాప్ చేసిన తర్వాత హత్య చేశారు. ఇతడు నీర్గుంటెపాల్య గ్రామానికి చెందినవాడు. దేవనహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన తర్వాత, ప్రీతమ్ తల్లి ఇంకా బంధువులు స్టేషన్ ఎదుట బైఠాయించి తీవ్ర నిరసన తెలిపారు.
పోలీసుల కథనం ప్రకారం, ప్రీతమ్ ఓ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. అతను తనకంటే రెండు సంవత్సరాలు పెద్దదైన యువతిని ప్రేమిస్తున్నాడు. ఆమె ఎంబీబీఎస్ విద్యార్థిని. ఈ సంబంధాన్ని ఆమె కుటుంబ సభ్యులు వ్యతిరేకించారు. హెచ్చరికలున్నా ప్రేమను కొనసాగించిన ప్రీతమ్‌ను శుక్రవారం రాత్రి అత్త కొడుకు శ్రీకాంత్, ఇతని మిత్రులతో కలిసి కిడ్నాప్ చేసి హత్య చేశారని ఆరోపణలు వస్తున్నాయి.
ప్రీతమ్ మృతదేహం ఆ గ్రామ సమీపంలో పడి ఉండగా, నిందితులు పరారయ్యారు. మృతుడి కుటుంబం, తల్లి కన్నీరుమున్నీరవుతూ తన కుమారుడికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
“హత్యపై మాకు సమాచారం లేదు” – బాధిత యువతి తండ్రి శ్రీనివాస్ స్పందన
ఈ ఘటనపై స్పందించిన యువతి తండ్రి శ్రీనివాస్, “నా కూతురు పల్లవి చిత్రదుర్గలో ఎంబీబీఎస్ చదువుతోంది. ఆ బాలుడు మా కూతురిని ప్రేమిస్తున్నానని లేఖ రాశాడు. కొద్ది రోజులుగా మా కూతురు అవసరినికి మించి డబ్బులు అడుగుతూ వుస్తుంది. నేను కూడా అలాగే ఇస్తూవచ్చాను. ఎందుకు అని అడగగా సమాధానం ఇవ్వకపోవడంతో.. ఇంటికి చేరుకున్న తర్వాత ఆమె ఫోన్‌ను తనిఖీ చేసినప్పుడు, హత్యకు గురైన ప్రీతమ్‌కు ఆమె ఒక స్నేహితుడి ద్వారా డబ్బులు చెల్లించిందని నేను కనుగొన్నాను. నేను అడిగినప్పుడు, అతను నా ఫోటోను ఉంచుకుని నన్ను బెదిరించాడు, మరియు నేను దానికి డబ్బు చెల్లించానని ఆమె నాకు చెప్పింది. కాబట్టి నేను నా కూతురిని తిట్టి, ఆమెకు నైతిక పాఠం చెప్పాను. తర్వాత నేను సిమ్ మార్చి ఫోన్ పేలోని ప్రతిదీ తొలగించాను. అలాగే, “మా కుటుంబానికి ఈ హత్యతో ఎలాంటి సంబంధం లేదు. మా భార్య చెల్లి కొడుకు చేసిన పనికి మేము బాధ్యులం కాదు,” అని స్పష్టం చేశారు. ప్రస్తుతం దేవనహళ్లి పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఇది కూడా చదవండి: Harish Rao: చంద్రబాబు ని కలిసిన హరీష్ రావు.. అన్‌ఫాలో కొట్టిన కెసిఆర్