Karimnagar: ప్రియుడితో భర్తకు మద్యం తాగించి బీరు సీసాలు, రాళ్ల కొట్టి చంపించే ప్రయత్నం బెడిసి కొట్టి కటకటాలపాలైన వనపర్తి మహిళ ఘటనను మరువక ముందే కరీంనగర్ జిల్లాలో మరో ఘటన చోటుచేసుకున్నది. అక్కడేమో భర్త కొన ఊపిరితో బతికి బట్టకట్టగా, ఇక్కడేమో ప్రాణాలిడిశాడు. రోజుకొకటి చొప్పున భర్తలను హతమార్చే ఘటనలు చోటుచేసుకుంటుండంతో ఆందోళన కలిగించకమానదు.
Karimnagar: కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన సంపత్ (45) నగరంలోని గ్రంథాలయంలో స్వీపర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆయనకు భార్య రమాదేవి, ఒక కొడుకు, కూతురు ఉన్నారు. రమాదేవి సర్వపిండి విక్రయిస్తుంటుంది. ఆ ఇద్దరి కష్టంతో వారి కుటుంబం హాయిగా సాగిపోతున్నది. ఈ దశలో రమాదేవికి ఒకరి పరిచయం ఆ ఇంటికి చీకట్లనే తెచ్చిపెట్టింది.
Karimnagar: రమాదేవి వద్ద కర్రె రాజయ్య (50) అనే వ్యక్తి తరచూ సర్వపిండి కొనుగోలు చేసేవాడు. ఆమెతో ఏర్పడిన పరిచయం కాస్త వివాహేతర బంధానికి దారితీసింది. ఈ దశలో వారి బంధం పీకలలోతుకు చేరి.. అసలు సంపత్‌ను కానరాని లోకానికి పంపించాలన్నంతగా చేరింది. ఎలాగైనా అతని అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేశారు.
Karimnagar: ఎలా చంపాలనే విషయంలో ఇద్దరూ ఆలోచించగా, యూట్యూబ్‌లోని ఓ వీడియో వారి కంటపడింది. గడ్డి మందు చెవిలో పోస్తే మనిషి చనిపోతాడంటూ ఆ వీడియోలో ఉన్నది. అదే ప్రకారం.. భర్త సంపత్‌ను కడతేర్చాలని రమాదేవి, రాజయ్య ప్లాన్ చేశారు. అనుకున్నట్టుగానే సంపత్‌తో కలిసి పార్టీ చేసుకుందామని రాజయ్య లిపించుకున్నాడు.
Karimnagar: పార్టీ చేసుకుందామని సంపత్‌ను రాజయ్య బొమ్మకల్ ఫ్లైఓవర్ వద్దకు తీసుకెళ్లాడు. రాజయ్య వెంట అతని స్నేహితుడైన శ్రీనివాస్ కూడా వెంట వచ్చాడు. ఈ సమయంలో రమాదేవి భర్త సంపత్‌కు పూటుగా మద్యం తాగించారు. ఆ మత్తులో సంపత్ తూలుతూ పడిపోయాడు. ఇదే సమయం అనుకున్న రాజయ్య తన వెంట తెచ్చుకున్న గడ్డిమందును సంపత్ చెవిలో పోయగా, కాసేపటికి సంపత్ చనిపోయాడు.
Karimnagar: సంపత్ చనిపోగానే ఫోన్ చేసి రమాదేవికి రాజయ్య జరిగిన విషయం తెలిపాడు. మరుసటి రోజు తన భర్త కనిపించడం లేదంటూ రమాదేవి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మళ్లీ ఆ తర్వాత తన భర్త చనిపోయాడని, మృతదేహం దొరకిందని పోలీసులకు ఆమే చెప్పింది. భర్త మృతికి కారణాలు తెలుసుకోకుండా, మృతదేహానికి పోస్టుమార్టం చేయొద్దని కోరడంతో పోలీసులకు అనుమానం వచ్చింది.
Karimnagar: కాల్ డేటా, ఫోన్ లొకేషన్, సీసీ పుటేజీ ఆధారంగా పోలీసులు చేపట్టిన విచారణలో అసలు బాగోతం బయటపడింది. ఆ రమాదేవి, రాజయ్య, శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా, తామే సంపత్‌ను హత్య చేసినట్టు అంగీకరించారు. యూట్యూబ్‌లో చూసి భర్తను ఎలా చంపాలో ప్రియుడికి చెప్పినట్టు రమాదేవి ఒప్పుకున్నది. కట్టుకున్న భర్తను 25 ఏండ్ల తర్వాత దూరం చేసుకోవాలనుకోవడంపై సభ్యసమాజం ఆందోళనకు గురవుతున్నది.