Kanpur: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో రోడ్డుపై పట్టపగలు ఓ యువతిపై ఇద్దరు వ్యక్తులు దాడి చేశారు. దాడి చేసిన ఇద్దరు వ్యక్తులను విపుల్ యాదవ్, సంజయ్ నిషాద్‌లుగా గుర్తించారు. ఆమెను తమ ఇంటికి ఈడ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా, కొట్టారు. నొప్పితో ఆమె ఏడుస్తూ వల్ల చర్యలను అడ్డుకునేందుకు ప్రయత్నించింది. ఈ సంఘటనను చూసేందుకు జనాలు గుంపుగూడారు. అటువేపు నుండి వెళ్తున్న వాళ్ళని సహాయం కోసం ఆర్తనాదాల చేస్తున్న నిర్మొహమాటంగా అక్కడ నుండి వెళ్లిపోవడం వెళ్లిపోయారు. యువతిపై దాడికి పాల్పడిన తీరును ఓ వ్యక్తి వీడియోలో బంధించాడు. ఇపుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
वो चींखती रही….रहम की गुहार लगाई रही….पर गुंडे को न आया ज़रा भी तरस!#कानपुर में महिला सुरक्षा के दावों को चुनौती देता #VideoViral pic.twitter.com/MXda8F2Ar9
— Himanshu Tripathi (@himansulive) December 16, 2024
ఈ సంఘటనను వీడియో రికార్డు చేసిన వ్వక్తి.. వీడియో లో పట్టపగలు నది రోడ్డుమీద ఇద్దరు వ్యక్తులు బాలిక పైన దాడిచేస్తునారు. అందులో ఒక వ్వక్తి ఆమె జుట్టును లాగుతూ రోడ్డు వెంట ఈడ్చుకుంటూ వెళుతుండగా, పక్కనే ఉన్న ఇంకో వ్వక్తి నిల్లబడి ఉన్నాడు. వాళ్ల పక్కన నుండి చాలా మంది చూస్తు వెళ్తున్నారు దృశ్యాలు మనం చూడొచ్చు. అది చుసిన పలువురు మహిళలు జోక్యం చేసుకుని ఘర్షణను ఆపేందుకు ప్రయత్నించగా, ఆ వ్యక్తి వారిని బలవంతంగా నెట్టేశాడు.
ఇది కూడా చదవండి: Delhi: జమిలి బిల్లుకు టీడీపీ పూర్తి మద్దతు..
ఈ సంఘటన డిసెంబర్ 14న ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జరిగింది. దాడి వెనుక కారణం స్పష్టంగా తెలియలేదు. అయితే వారు తన పట్ల అనుచితంగా ప్రవర్తించారని తప్పుడు ఉద్దేశ్యంతో తమ ఇంటికి తీసుకెళ్లడానికి ప్రయతించారు అని బాలిక మీడియాకు తెలిపింది.
చెప్పుతో కొట్టారు, తన్నారు.
“వారు నన్ను కొట్టారు అసభ్యకరం ప్రవర్తించారు” అని ఆమె NDTV పోస్ట్ చేసిన వీడియోలో పేర్కొంది. వారి నీచమైన చర్యలకు వ్యతిరేకంగా పోరాడుతున్నప్పుడు ఆ అమ్మాయిని ఇద్దరు వ్యక్తులు తన్నారని, చెంపదెబ్బ కొట్టారని, వీడియో లో ఉంది.
సోషల్ మీడియా లో ఈ వీడియో వైరల్ కావడంతో అది చుసిన యూపీ పోలీసులు యాదవ్ ఇంకా నిషాద్‌లను అరెస్ట్ చేశారు.