Kannappa: నటి కాజల్ కొంతకాలంగా తెలుగులో కంటే పరభాషా చిత్రాలకే ప్రాధాన్యం ఇస్తోంది. హిందీలో ఉమ`తో పాటుగా సల్మాన్ ఖాన్ `సికిందర్`లోనూ కీలక పాత్రను పోషిస్తోంది. అలానే శంకర్ దర్శకత్వం వహించిన `ఇండియన్ -3`లోనూ నటించింది. గత యేడాది లేడీ ఓరియంటెడ్ మూవీ `సత్యభామ చేసిన కాజల్… `కన్నప్ప`లో గెస్ట్ అప్పీయరెన్స్ ఇచ్చింది. `కన్నప్ప`లో ఆమె పోషించిన పార్వతీదేవి లుక్ ను మేకర్స్ సోమవారం రివీల్ చేశారు.
ఇది కూడా చదవండి: Nellore: కొండేపాటి గంగా ప్రసాద్ క్రేజ్… న్యూ ఇయర్‌లో జాతర
Kannappa: గతంలో మంచు విష్ణు సినిమా `మోసగాళ్ళు`లో అతని సోదరిగా కాజల్ నటించింది. ఆ అనుబంధం తోనే ఈ సినిమాలోనూ ఆమె యాక్ట్ చేసిందని అంటున్నారు. మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా ఏప్రిల్ 25న విడుదల కాబోతోంది. మరి ‘సత్యభామ’ ద్వారా లభించని విజయం… ‘కన్నప్ప’ ద్వారా కాజల్ కు లభిస్తుందేమో చూడాలి.
మహేశ్ ఆవిష్కరించిన ‘ఫతే’ సెకండ్ ట్రైలర్!
Mahesh: ఈ యేడాది జనవరి 10న జీ స్టూడియోస్ కు చెందిన రెండు సినిమాలు జాతీయస్థాయిలో ఒకదానితో ఒకటి పోటీ పడబోతున్నాయి. అందులో మొదటిది రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకు జీ సంస్థ కూడా నిర్మాణ భాగస్వామి. అలానే సోనూసూద్ హీరోగా, ఆయన దర్శకత్వంలోనే రూపుదిద్దుకున్న ఫతే చిత్రానికి కూడా జీ స్టూడియోస్ పార్టనర్ గా వ్యవహిస్తోంది. జాక్విలిన్ ఫెర్నాండేజ్ హీరోయిన్ గా నటించిన ఫతే మూవీని సైబర్ క్రైమ్ నేపథ్యంలో సోనూసూద్ తెరకెక్కించారు. ఈ సినిమా ట్రైలర్ ను సోమవారం మహేశ్ బాబు సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. సోనూసూద్ నుండి ప్రేక్షకులు ఎలాంటి యాక్షన్ మూవీని కోరుకుంటారో… ఇది అలానే ఉంది!