Hii Nanna: నేచురల్ స్టార్ నాని, మృణాళ్ ఠాకూర్ జంటగా నటించిన ‘హాయ్ నాన్న’ సినిమా 2023 డిసెంబర్ 7న విడుదలైంది. ఈ మూవీతో శౌర్యువ్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఈ సినిమా విడుదలై యేడాది గడిచిపోయిన తర్వాత ఇప్పుడో కన్నడ నిర్మాత అది తమ చిత్రానికి ఫ్రీ మేక్ అని చెబుతున్నాడు. ప్రముఖ కన్నడ నిర్మాత పుష్కర మల్లికార్జునయ్య ఆరోపిస్తోంది ఏమిటంటే… ఆయన నిర్మించిన ‘భీమసేన నల మహారాజ’ సినిమా కథే.. ‘హాయ్ నాన్న’ అట.
అందులోని కోర్ పాయింట్ ను తీసుకుని నాని సినిమాను తీశారని ఆరోపిస్తున్నారు. 2020లో కరోనా కారణంగా తమ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేశామని, దాని రీమేక్ హక్కులు తీసుకోకుండా తెలుగులో తీసి పారేశారని వాపోతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. నిజానికి సినిమా విడుదలైప్పుడు మౌనంగా ఉండి ఇప్పుడీ ఆరోపణ ఎందుకు చేస్తున్నారో మరి!?
హాయ్ నాన్న మూవీ సాంగ్ ప్లే;