Shobitha: కన్నడ బుల్లితెర హీరోయిన్ శోభిత ఆత్మహత్యకు పాల్పడ్డారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి శ్రీరాంనగర్ కాలనీలోని సీ బ్లాక్‌లో ఉన్న ఆమె ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని సూసైడ్‌కు పాల్పడినట్లుగా పోలీసులకు సమాచారం అందింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన గచ్చిబౌలి పోలీసులు శోభిత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు.


