Actress Haripriya: ప్రముఖ కన్నడ నటి హరిప్రియ తెలుగులో బాలకృష్ణ, వరుణ్ సందేశ్ సరసనే కాకుండా పలు చిత్రాలలో హీరోయిన్ గా నటించింది. అలానే నటుడు వశిష్ఠ సింహా తెలుగులో పలు చిత్రాలలో కీలక పాత్రలు పోషించాడు. వీరిద్దరూ 2023 జనవరి 26న ప్రేమ వివాహం చేసుకున్నారు. సరిగ్గా రెండేళ్ళకు అదే రోజున హరిప్రియ మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని వశిష్ట సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. దాంతో వీరిద్దరి అభిమానులు, తోటి నటీనటులు ఈ జంటను అభినందిస్తున్నారు.
