Kangana Ranaut: హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి చెందిన కేసులో అల్లు అర్జున్‌ను శుక్రవారం ఉదయం అరెస్టు చేశారు. అల్లు అర్జున్ అరెస్టుపై నటి రాజకీయవేత్త ఐన కంగనా రనౌత్ శుక్రవారం స్పందించారు ఇది “చాలా దురదృష్టకర” సంఘటనగా ఆమె అభివర్ణించారు.
మండి ఎంపీ ఆజ్ తక్‌తో మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ “జవాబుదారీతనం” ఉండాలని అన్నారు. హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మరణించిన కేసులో అర్జున్‌ను శుక్రవారం ఉదయం అరెస్టు చేశారు. అల్లు అర్జున్ ప్రీమియర్స్ కి వేస్తారు అని తెలిసి కూడా థియేటర్ మేనేజ్‌మెంట్ సరియైన బందోబస్తే చేయకపోవడం వల్లనే తొక్కిసలాట జరిగింది అని ఆమె అన్నారు.
ఇది చాలా దురదృష్టకరం.నేను అల్లు అర్జున్ కి సపోర్ట్ ఇస్తున్నాను. అతనికి బెయిల్ కూడా వచ్చింది. మనం సెలబ్రిటీస్ కాబట్టి మనకి ఎలాంటి స్పెషల్ ట్రీట్మెంట్ ఉండదు అని తెలిపారు. అలాగే ప్రజల ప్రాణాలు కూడా విలువైనవి అని స్మోకింగ్ యాడ్స్ చేస్తున్నపుడు. రద్దీగా వున్నా థియేటరే వద్ద చిత్ర యూనిట్ ఏవైనా కారిక్రమలు చేస్తున్నపుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అన్ని అన్నారు.

