Kamareddy:తెలంగాణ యువకుడిని ఓ కేసు విషయంలో విచారించే నిమిత్తం వచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులను అడ్డుకున్న ఘటన తెలంగాణలోని ఓ గ్రామ పరిధిలో చోటుచేసుకున్నది. కామారెడ్డి జిల్లా రామారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలోని మద్దికుంట గ్రామానికి చెందిన యువకుడిని ఓ కేసు విషయంలో అరెస్టు చేయడానికి ఆంధ్రా పోలీసులు వచ్చారు.
Kamareddy:ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు మద్దికుంట గ్రామానికి చెందిన కొందరు గ్రామస్థులు అడ్డగించారు. పోలీసులపై తిరగబడి వెనక్కి పంపారు. దీంతో చేసేదిలేక ఆ ఆంధ్రప్రదేశ్ పోలీసులు రామారెడ్డి మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్ ను ఆశ్రయించారు. గ్రామస్తులు అక్కడికి కూడా చేరుకొని ఆంధ్రా పోలీసులను నిలదీశారు. ఈ ఘటనపై స్థానిక పోలీసుల విచారణ కొనాసగుతున్నది.

