Kamareddy district: పంచాయతీ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలతోపాటు దాడులు, దౌర్జన్యాలు కూడా చోటుచేసుకుంటున్నాయి. కామారెడ్డి జిల్లాలో కూడా ఇలాంటి దాడులకు అధికార పార్టీ నాయకులు తెగబడ్డారు. తనకు ఎదురే లేనంతగా ఆ పార్టీ నుంచి సర్పంచ్‌గా గెలిచిన అభ్యర్థి దౌర్జన్యానికి దిగాడు. ఏకంగా ట్రాక్టర్‌తో తొక్కించి దాష్టీకానికి పాల్పడ్డాడు. దీంతో ప్రత్యర్థులకు తీవ్రగాయాలయ్యాయి.
Kamareddy district: కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం పరిధిలోని సోమార్‌పేట గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా బిట్ల బాలరాజు పోటీ చేయగా, కాంగ్రెస్ నుంచి ఆ పార్టీ మండల అధ్యక్షుడి బాబాయి నిలబడ్డారు. ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి బాలరాజు ఓటమి పాలవగా, కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి గెలుపొందారు.
Kamareddy district: ఎన్నికల ఫలితాల అనంతరం బీఆర్ఎస్ అభ్యర్థి, అతని అనుచరులు, కుటుంబ సభ్యులతో కలిసి ఇంటి ముందు కూర్చొని ఉన్నారు. ఈ సమయంలో కాంగ్రెస్ అభ్యర్థి ట్రాక్టర్‌పై వచ్చి ఏకంగా ఆ ట్రాక్టర్‌ను వారిపైకి తోలుకెళ్లాడు. ఈ దాడిలో బీఆర్ఎస్ అభ్యర్థి, అతని అనుచరులకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే బాధితులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

