Kamareddy::భారీ వర్షం ప్రభావంతో రహదారి రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. నిర్మల్–కామారెడ్డి మధ్య జాతీయ రహదారి-44 కోతకు గురవడంతో వాహనాలు నిలిచిపోయాయి.
కొండాపూర్ వద్ద సుమారు 10 కి.మీ మేరకు భారీగా వాహనాల క్యూ ఏర్పడింది. దీంతో హైదరాబాద్–నిర్మల్ మధ్య రాకపోకలు పూర్తిగా ఆగిపోయాయి. పరిస్థితిని నియంత్రించేందుకు కంటైనర్లు, భారీ లారీలను అధికారులు ఇతర మార్గాలకు మళ్లించారు.
అదే సమయంలో జగిత్యాల–ఖానాపూర్ రహదారి పూర్తిగా మూసివేయబడింది. బాసర ప్రాంతంలో వరద ప్రవాహం పెరగడంతో భైంసా–నిజామాబాద్ రహదారి నీటమునిగింది. ఫలితంగా ఈ మార్గంలో కూడా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
భైంసా–బోధన్ మధ్య కూడా రవాణా స్తంభించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరద నీరు తగ్గే వరకు ప్రయాణం వాయిదా వేసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు.