Thug Life: మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ నటించిన ‘థగ్ లైఫ్’ సినిమా జూన్ 5న విడుదలై ప్రేక్షకులను నిరాశపరిచింది. శింబు, త్రిషలతో కూడిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, బలహీన కథ, నీరసమైన స్క్రీన్‌ప్లే కారణంగా సినిమా ఆకట్టుకోలేకపోయింది. ఫలితంగా, బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ టాక్ సొంతం చేసుకుంది.
ఇదిలా ఉండగా, కన్నడ ప్రేక్షకులు మాత్రం ఈ విషయంలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సినిమా ప్రమోషన్స్ సందర్భంగా కమల్ చేసిన కొన్ని వ్యాఖ్యలు కన్నడిగులను ఆగ్రహానికి గురిచేశాయి. దీంతో, క్షమాపణ చెప్పాలని కర్ణాటక డిస్ట్రిబ్యూటర్స్ షరతు విధించారు.
Also Read: Ravi Teja: మాస్ మహారాజ్ రవితేజ స్పీడ్ షో.. మరోసారి ఖిలాడీ బ్యూటీతో జోడీ!
Thug Life: కమల్ దీనికి ససేమిరా అనడంతో సినిమా కర్ణాటకలో విడుదల కాలేదు. ఇప్పుడు కన్నడ అభిమానులు సోషల్ మీడియాలో “మా రాష్ట్రంలో రిలీజ్ కాకపోవడమే మంచిది, లేకపోతే ఈ నీరస చిత్రం చూసి మేమూ నష్టపోయేవాళ్లం” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.