Kamal Haasan

Kamal Haasan: రాజ్యసభకు కమల్ హాసన్.. ఆయన ఆస్తులెంత?

Kamal Haasan: రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ తాజాగా ఆయన నామినేషన్ వేశారు. ఈ నామినేషన్ ద్వారా కమల్ హాసన్ ఆస్తులు వెల్లడయ్యాయి. కమల్ దాఖలు చేసిన నామినేషన్ పత్రాల్లో తనకు రూ.305.55 కోట్ల (రూ.245.86 కోట్ల విలువైన చరాస్తులు, రూ.59.69 కోట్ల స్థిరాస్తులు) ఆస్తులు ఉన్నాయని తెలిపారు. గత నాలుగు సంవత్సరాలుగా ఆయన మొత్తం అప్పు రూ.49 కోట్లుగానే ఉంది. 2023-2024 సంవత్సరానికి కమల్ ఆదాయం తన పన్ను రిటర్నుల ప్రకారం రూ.78.9 కోట్లు. ఇది 2019-2020లో రూ.22.1 కోట్లుగా ఉంది. ఆయన చరాస్తుల విలువ రూ.59.69 కోట్లకు పెరిగింది. అలాగే 2021లో రూ.45.09 కోట్ల నుండి దాదాపు రూ.15 కోట్లు పెరిగింది. ఆయన స్థిరాస్తుల విలువ రూ.245.86 కోట్లు. 2021లో రూ.131.84 కోట్లుగా ఉంది. ఆయనకు నాలుగు కమర్షియల్ బిల్డింగ్స్ ఉన్నాయి. అల్వార్‌పేటలో రెండు, ఉతండిలో ఒకటి, షోలింగనల్లూర్‌లో మరొకటి. వీటి మొత్తం మార్కెట్ విలువ సుమారు రూ.111.1 కోట్లు. దిండిగల్‌లోని విల్‌పట్టి గ్రామంలో వ్యవసాయ భూమిని కూడా ఆయన కలిగి ఉన్నారు. దీని విలువ రూ.22.24 కోట్లు. అలాగే ఆయన వద్ద రూ.49.67 కోట్ల రుణం, రూ.2.60 లక్షల నగదు, మహీంద్రా బొలెరో, మెర్సిడెస్-బెంజ్, బిఎమ్‌డబ్ల్యూ, లెక్సస్ అనే నాలుగు కార్లు ఉన్నాయని, వాటి మొత్తం విలువ రూ.8.43 కోట్లు అని కూడా సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *